ఈ మద్య కొంతమంది హిట్ డైరెక్టర్లు తమ ఫేవరెట్ హీరోలతో సినిమా చేసే ఛాన్స్ ఎప్పుడొస్తుందో అని ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. వాళ్లలో తమిళ్ లో సూపర్ హిట్ సినిమాలు చేసిన డైరెక్టర్ అట్లీ.. ఎన్టీఆర్ కోసం వెయిట్ చేస్తున్నాడు. యంగ్ టైగర్ తో సినిమాలు చెయ్యడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు. అంతే కాదు తప్పకుండా ఎన్టీఆర్ తో సినిమా చేస్తానని పబ్లిక్ గానే చెప్పాడు.

 

ఎన్టీఆర్ తో అట్లీ సి నిమా చేయాలని డిసైడ్ అయ్యాడు. కానీ ఎన్టీఆర్ కి ఒక వైపు రాజమౌళి సినిమాతో పాటు త్రివిక్రమ్ సినిమా కూడా చెయ్యాల్సి ఉంది. మరోవైపు ఎన్టీఆర్ తో బంపర్ హిట్లు కొట్టిన కొరటాల  ఎన్టీఆర్ తో సినిమా చెయ్యడానికి రెడీగా ఉన్నాడు . వీళ్ల సినిమాలు కంప్లీట్ అయ్యాక కానీ అట్లీ గురించి ఆలోచించే పరిస్తితి లేదు ఎన్టీఆర్ కి. ఆ టైమ్ ఎప్పుడొస్తుందా అని వెయిట్ చేస్తున్నాడు అట్లీ.

 

నెక్స్ట్ ప్రశాంత్ నీల్ కెజిఎఫ్ సినిమాతో ఆల్ ఓవర్ ఇండియా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా పరిచయం అయ్యాడు . ఇప్పుడు కే జీ ఎఫ్ 2 తో మరో  భారీ సక్సెస్ కి రెడీ అవుతున్నాడు . కన్నడలో సినిమాలు చేస్తున్న ప్రశాంత్ తెలుగులో పెద్ద హీరోలతో భారీ బడ్జెట్ సినిమా చెయ్యాలని కలలు కంటున్నాడు. అందుకే  అటు మహేష్ తో, ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో పాటు ఎన్టీఆర్ తో కూడా సినిమా చెయ్యడానికి ఆరాటపడుతున్నాడు. అందకు తగ్గ స్టోరీలు చెబుతున్నా.. అదిగో ఇదిగో అంటూ వెయిట్ చేయిస్తున్నారు హీరోలు. అందుకే ఈ ముగ్గురిలో ఎవరు పిలుస్తారా అని ఎదురు చూస్తున్నాడు  ప్రశాంత్ నీల్.

 

డైరెక్టర్ సందీప్ రెడ్డి కూడా కథలు పట్టుకుని రెడీగా ఉన్నాడు. తెలుగులో అర్జున్ రెడ్డి, హిందీలో కబీర్ సింగ్ చేసి.. బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టిన సందీప్ రెడ్డి హీరో కోసం వెయిట్ చేస్తున్నాడు. హిందీలో హిట్ ఇచ్చాడుకదా అని  స్టార్ హీరోలు సినమా చేద్దామనుకున్నారు. కానీ కథలు పట్టుకుని తిరిగిన సందీప్ ని ఇంతవరకూ ఏ హీరో ఓకే చెయ్యలేదు .

మరింత సమాచారం తెలుసుకోండి: