బాలీవుడ్ లో తన సహజన నటనతో కోట్ల మంది అభిమానులను సంపాదించింది విద్యాబాలన్.  ఎప్పుడు నిండైన శారీతో కుంకుమ బొట్టు తో భారతీయ సాంప్రదాయం ఉట్టిపడేలా కనిపిస్తుంది.  అందుకే విద్యా బాలన్ కి అంత క్రేజ్.  గ్లామర్ పాత్రల్లో నటించకున్నా ఆమె  టాప్ హీరోయిన్స్ కి ఉన్న క్రేజ్ ఉంది.  ఆ మద్య క్రిష్ దర్శకత్వంలో బాలయ్య నటించిన ఎన్టీఆర్ బయోపిక్ లో నటించింది.  వెండి తెరపైనే కాదు బుల్లితెరపై కూడా తన సత్తా చాటుకుంటుంది.  తాజాగా కరోనా వైరస్ నిర్మూలించే ప్రయత్నం డాక్టర్ల కృషికి సెల్యూట్ చేస్తుంది.   ప్రస్తుతం డాక్టర్లు ప్రాణాలకు త్యాగానికైని సిద్దపడుతున్నారు.  తాము కరోనా పై యుద్దం చేస్తున్నారు.  

 

కరోనా సోకినవారిని కాపాడే ప్రయత్నంలో వైద్యులు తమ ప్రాణాలను అడ్డుపెట్టి వారికి వైద్యం చేస్తున్నారు. కరోనా సోకి అక్కడక్కడా వైద్యులు సైతం మృత్యువాత పడుతున్నారు. ఇంత చేస్తున్న వైద్యులకు ఇంటి యజమానుల నుంచి, ఈ సమాజం నుంచి తీవ్ర అవమానాలు ఎదురవుతున్నాయి. ఈ క్రమంలో సైనికులలా పనిచేస్తున్న వైద్యులు, వైద్య సిబ్బంది శ్రేయస్సు కోసం 1000 పర్సనల్‌ ప్రొటెక్టివ్‌ ఎక్విప్‌మెంట్‌ (పీపీఈ) కిట్స్‌ను అందించేందుకు బాలీవుడ్ హీరోయిన్ విద్యాబాలన్ ముందుకు వచ్చారు. దేశంలో కరోనా పీడితులను డాక్టర్లు దేవుళ్లలా కాపాడుతున్నారని అన్నారు.  

 

ఇందుకోసం ఆమె విరాళాలు సేకరిస్తున్నారు.   ఇటీవల బ్లౌజ్ తో మాస్క్ ఎలా తయారు చేసుకోవాలో తెలియజేసింది.  ఆరోగ్యంగా ఉండాలని టిప్స్ ఇస్తుంది.  తాజాగా వైద్యుల కోసం వెయ్యి పీపీఈ కిట్లని ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. ఇందులో మీరు కూడా భాగం కావాలని కోరుతున్నాను అని విద్యాబాలన్ పిలుపునిచ్చారు. ‘కరోనా పేషెంట్లను బాగు చేయడమే వారి లక్ష్యం అయిందిప్పుడు.  ప్రాణాంతక వైరస్ ఒకరికి చేరిందంటే వారి నుంచి 8 నుంచి 12 మందికి సోకుతుంది. దీంతో క్వారంటైన్‌లో ఉండే వారి సంఖ్య పెరిగి ఆసుపత్రులు నిండిపోతాయి. అందుకే వారికి రక్షణ ఇచ్చే పీపీఈ కిట్ల కోసం నిధుల సేకరణ మొదలు పెట్టానని చెబుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: