ప్ర‌స్తుతం బుల్లితెర‌పై యాంక‌ర్ల హ‌వా ఓ రేంజ్‌లో కొన‌సాగుతోంది. సెల‌బ్రెటీల త‌ర్వాత సెల‌బ్రెటీలు అంటే టీవీ యాంక‌ర్లే అని చెబుతుంటారు. ఇక ఇప్ప‌టికీ సుమ టాప్ యాంకర్‌గానే కొనసాగుతుండగా.. జబర్దస్త్ యాంకర్స్ అనసూయ, రష్మిలకు ఉన్న క్రేజ్ వేరు. యాంకరింగ్‌కి హాట్ నెస్ జోడించి జబర్దస్త్‌గా ఎంటర్టైన్ చేయడం వీళ్ల టాలెంట్. వీరు బుల్లితెర‌పై చేసే మాయ అంతా ఇంతా కాదు. ఈ క్ర‌మంలో భారీ స్థాయిలో క్రేజ్ కూడా సంపాదించుకున్నారు. అయితే వారి క్రేజ్‌కు త‌గ్గ‌ట్టే వారి రెమ్యున‌రేష‌న్ ఉంటుంది. సినిమా హీరోయిన్లుకు ఏమాత్రం తీసిపోని విధాంగా వీరు సంపాదిండం విశేషం.

 

అంద‌రి సంపాద‌న అలాగే ఉంటుంద‌నుకోవ‌డం అత్యాశే అయినా కూడా కొంద‌రు మాత్రం బాగానే వెన‌కేసుకుంటున్నారు. అందులో ముందుగా యాంక‌ర్ సుమ‌. బుల్లితెర మీద ఎప్పుడు నుంచో సంద‌డి చేస్తున్న యాంక‌ర్ సుమ.. రెమ్యునరేషన్ విష‌యంలో కూడా ముందువ‌రుస‌లో ఉంటుంది. ఈమె ఇప్ప‌టికీ ప్ర‌తీ రోజూ వివిధ ఛానెల్స్ లో రియాలిటీ షోస్ కు తోడు.. ఆడియో వేడుక‌ల‌కు కూడా వ్యాఖ్యాత‌గా ఉంటుంది. ఒక్కో ఆడియో ఫంక్ష‌న్ కు దాదాపు 2 నుంచి 2.5 ల‌క్ష‌ల వ‌ర‌కు సుమ వ‌సూలు చేస్తుంద‌ని భావిస్తున్నారు.

 

ఇక సుమ త‌రువాత చెప్పుకొవాల్సింది యాంక‌ర్ అన‌సూయ‌.పెళ్లి అయి ఇద్ద‌రు పిల్లలు ఉన్న‌ప్ప‌టికి త‌న హాట్ హాట్ అందాల‌తో ప్రేక్ష‌కుల‌ను క‌ట్టిప‌డేస్తుంది అనసూయ‌.  ఖాళీ సమయాల్లో రిబ్బన్ కటింగ్స్ అంటూ షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్‌కి హైదరాబాద్‌ నుండి అమలాపురం వరకూ చుట్టేస్తోంది అనసూయ. అయితే ఈ హాట్ బామకు అటు బుల్లితెరపైన ఇటు వెండితెరపైన ఫుల్ డిమాండ్ ఉండటంతో ఒక్కో ఈవెంట్ కు దాదాపు 2 ల‌క్ష‌లు ఛార్జ్ చేస్తుంద‌నే ప్ర‌చారం జ‌రుగుతుంది. ఈ మ‌ధ్య ఈవెంట్స్ చేయ‌డం మానేసిన అన‌సూయ‌.. టీవీ షోల‌తోనే బిజీగా ఉంది.

 

ఇక లేట్‌గా వ‌చ్చినా భారీ స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్న ర‌ష్మీ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. బుల్లితెరపై యాంకర్ గా తన సత్తా చాటుతోన్న రష్మి ప్రస్తుతం టీవీ షోలతో బిజీగా గడుపుతోంది. మ‌రియు తెలుగు రాక‌పోయిన‌ప్ప‌టికి వ‌చ్చిన అవ‌కాశాలు స‌ద్వినియోగం చేసుకోవ‌డంలో విజ‌యం సాధించింది ర‌ష్మీ. ఈ భామ రెమ్యున‌రేష‌న్ దాదాపు ల‌క్ష‌న్న‌రపైనే ఉంది. సినిమాల్లో క్రేజ్ పెరిగిన త‌ర్వాత ర‌ష్మి రేట్ కూడా డ‌బుల్ అయిపోయిందంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: