అక్కినేని సమంత.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో నాగ చైతన్య కథానాయకుడిగా తెరకెక్కిన ‘ఏమాయ చేసావే’ సినిమాతో తెలుగు చిత్రపరిశ్రమకు కథానాయికగా పరిచయమైన విషయం తెలిసిందే. ఈ చిత్రంతో నటిగా మంచి గుర్తింపుతో పాటు పలు అవార్డులను కూడా సొంతం చేసుకున్నారు. తన మొదటి హీరో నాగచైతన్య నే వివాహం చేసుకుని అక్కినేని ఫ్యామిలీలో కోడలిగా అడుగు పెట్టింది. అక్కినేని వారి ఇంటి కోడలైన తర్వాత ఈమె కెరీర్ మూడు హిట్లు.. ఆరు సినిమాలన్నట్టుగా సాగిపోతుంది. ఒకవైపు వైవాహిక జీవితాన్ని ఇంకోవైపు సినీ జీవితాన్ని బ్యాలెన్స్ చేసే విధానం చూసి మిగతా ఇండస్ట్రీ జనాలు ఆశ్చర్యపోతున్నారు. తాజాగా ఈ భామ ఒక ఇంగ్లీష్ పత్రిక నిర్వహించే పోల్లో మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ 2019 టైటిల్ను కైవసం చేసుకుంది. ఈ అవార్డులపై కొన్ని విమర్శలు వచ్చినా.. నిజంగానే సమంత మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ అనే చెప్పాలి. ఈ ఏడాది దిల్ రాజు నిర్మాణంలో చేసిన ‘జాను’తో పలకరించింది. సామాజిక కార్యకలాపాల్లో ఎప్పుడూ ముందుండే సమంత సోషల్ మీడియాలో కూడా యాక్టీవ్ గా ఉంటుంది.
కాగా సమంత బర్త్ డే ఈ నెల 28 కావడంతో అభిమానులు ఇప్పటికే సోషల్ మీడియాలో హంగామా మొదలు పెట్టేశారు. అయితే 33వ బర్త్ డే జరుపుకోనున్న సమంత కోసం అభిమానులు కామన్ డీపీ రూపొందించారు. దీనిని మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా తన ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు. ఈ ప్రత్యేక సందర్భంలో సమంత డీపీ విడుదల చేస్తున్నాను.. సమంత తన కెరీర్ని అత్యద్భుతంగా మలచుకొని ముందుకు వెళుతున్న తీరు ఆదర్శం. బ్యూటీ విత్ బ్రెయిన్, సూపర్ స్టైలిష్, ఏకాగ్రత, మంచి నైపుణ్యం ఉన్న నటి. ఆమెతో నాకు పరిచయం ఉండడం నా అదృష్టం అని తమన్నా ట్వీట్ చేసింది. దీనిపై స్పందించిన సామ్.. నువ్వు నా డార్లింగ్ వి.. మంచి మాటలు చెప్పావు.. లవ్యూ బేబి అని రిప్లై ఇచ్చింది. కొద్ది రోజులుగా సమంత సోషల్ మీడియాలో చాలా సైలెంట్ గా ఉండగా రెండు రోజుల క్రితమే గాఢ నిద్ర నుండి మేల్కొన్నానంటూ ట్వీట్ చేసింది. ఈ ఫొటోలో 'హ్యాపీ బర్త్ డే తలైవి సమంత' అని ఆమెకు ఫ్యాన్స్ విషెస్ చెప్తున్నట్లు ఉంది. వాస్తవానికి తమిళనాడు మాజీ సీఎం దివంగత జయలలిత ని అక్కడి వారు 'తలైవి' అని సంభోదిస్తుంటారు. ఇప్పుడు ఫ్యాన్స్ సామ్ ని అలా సంబోధించడం చర్చనీయాంశం అయింది. మరి రానున్న రోజుల్లో ఈ కామన్ డీపీ పై ఎంతమంది రియాక్ట్ అవుతారో చూడాలి.
On an exceptionally special occasion, I’d like to reveal #SamanthaBirthdayCDP
— tamannaah bhatia (@tamannaahspeaks) April 25, 2020
The way she has driven her career is something I look up to ❤️
A beauty with brains,super stylish,a people’s person & an extremely diligent & talented actress!
I’m Lucky to know her 😊@Samanthaprabhu2 pic.twitter.com/hQ7OpWIDPn