సహాయం చేయడంలో తనకి ఎవరూ సాటిలేరని మరోసారి నిరూపించుకున్నాడు రాఘవ లారెన్స్. కరోనా లాక్‌డౌన్ కారణంగా పనిలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న పేద నృత్య కళాకారులకు ఆర్ధిక సహాయాన్ని అందించారు డాన్స్ మాస్టర్ రాఘవ లారెన్స్. ఒక్కొక్కరికీ 25,000 రూపాయల చొప్పున హైదరాబాద్ లో 10 మందికి.. చెన్నై లో 13 మందికి కలిపి మొత్తం 23 మందికి 5 లక్షల 75 వేల రూపాయలు లారెన్స్ డైరెక్ట్ గా వారి అకౌంట్లో వేశారు. ఈ సందర్భంగా రాఘవ లారెన్స్ మాట్లాడుతూ.. డాన్స్ నే నమ్ముకుని, ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద నృత్య కళాకారులకు ఆర్థిక సహాయాన్ని అందించడం నా బాధ్యత గా భావించి వారి అకౌంట్ల కు డైరెక్ట్ గా డబ్బు పంపించడం జరిగిందన్నారు. తను పైకి వచ్చిన నృత్య రంగంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారిని కష్టకాలంలో ఆదుకుంటూ రాఘవ లారెన్స్ తన పెద్ద మనసు మరోసారి చాటుకున్నారు. ఎవరికి ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా సహాయం చేసే వారిలో ముందుటాడు రాఘవ లారెన్స్. తను సంపాదించిన దాంట్లో ఎక్కువ భాగం సమాజసేవకే ఉపయోగిస్తుంటారు. 

 

ఇప్పటికే లారెన్స్ కరోనా రిలీఫ్ ఫండ్ అంటూ 3 కోట్ల రూపాయలను విరాళంగా ఇచ్చాడు. అంతటితో ఆపకుండా మధ్యమధ్యలో మరిన్ని మంచి పనుల్లో సాయం అందిస్తున్నాడు. ఈ కష్టకాలంలో లారెన్స్ చేసిన మరో మంచి పనితో నిజమైన హీరోగా తమిళ సినీవర్గాలకు మరీంత దగ్గరయ్యాడు. తమిళ్ డిస్ట్రిబ్యూషన్ అసోసియేషన్ కి 25లక్షల ఆర్థిక సహాయాన్ని అందించాడు. ఇటీవల తమిళ్ న్యూ ఇయర్ సందర్భంగా 15లక్షల వరకు శానిటేషన్ వర్కర్స్ కోసం అందజేశారు. ఇప్పుడు పేద నృత్య కళాకారులకు ఆర్ధిక సహాయాన్ని అందించి సాయం చేయడంలో సరిలేరు అనిపించుకున్నాడు. ఇక సినిమాల విషయానికొస్తే లారెన్స్ అక్షయ్ కుమార్ తో 'కాంచన' సినిమాకు రీమేక్ గా 'లక్ష్మీ బాంబ్' చేస్తున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: