జూనియర్ ఎన్టీఆర్ సినిమా వస్తుంది అంటే చాలు ఆయన అభిమానులు చేసే హడావుడి ఏ స్థాయిలో ఉంటుందో అందరికి తెలిసిందే. సినిమా కథ విషయం నుంచి ప్రతీ ఒక్కటి కూడా టాలీవుడ్ లో చర్చలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ప్రతీ చిన్న విషయాన్ని కూడా ఎక్కువగా పట్టించుకునే ప్రయత్నం చేస్తారు అభిమానులు. తారక్ కి ఉన్న క్రేజ్ ఆ రేంజ్ లో ఉంటుంది. ఇక నందమూరి అభిమానులకు అయితే ఆయన సినిమా వస్తుంది అంటే చాలు ఒకరకంగా పండగ వాతావరణం అనే విషయం అందరికి తెలిసిందే. 

 

ప్రస్తుతం మన తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా చేయడానికి చాలా మంది అగ్ర దర్శకులు ఎదురు చూస్తున్నారు. ఇది పక్కన పెడితే అతని తో సినిమా చేయడానికి సంజయ్ లీలా బన్సాలి అనే బాలీవుడ్ దర్శకుడు ప్రయత్నాలు చేస్తున్నాడు అనే వార్తలు వస్తున్నాయి. బన్సాలి తారక్ కోసం ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్నాడు అని అందులో భాగంగానే ఈ మధ్య అతన్ని హైదరాబాద్ లో కూడా తారక్ కలిసాడు అని అంటున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత తారక్ త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. 

 

సినిమా కథ కూడా రెడీ అయింది ప్రస్తుతం సినిమా షూటింగ్ కి ముందు పనులను దర్శక నిర్మాతలు పూర్తి చేస్తున్నారు. ఈ ఏడాది జూన్ తర్వాత ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకుని వెళ్ళే అవకాశాలు ఉన్నాయని టాలీవుడ్ లో టాక్ వినపడుతుంది. ఈ సినిమా తర్వాత తారక్ బన్సాలి తో ఒక సినిమా చేసే అవకాశం ఉందని రణవీర్ సింగ్ తో ఈ సినిమా కలిసి చేస్తాడని అంటున్నారు. రణవీర్ సింగ్ ఈ సినిమాలో తారక్ కి విలన్ గా నటించే అవకాశం ఉందని సమాచారం. ఇప్పటికే ఒక కథ కూడా సిద్దంగా ఉందని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: