టాలీవుడ్ లో సుకుమార్ సినిమా వస్తుంది అంటే చాలు జనాలకు ఒకరకమైన ఆసక్తి అనేది సాధారణంగా ఉంటుంది అనే విషయం అందరికి తెలిసిందే. కథ ఏ విధంగా ఉంటుంది అని అందరూ కూడా ఆసక్తి చూపిస్తారు. ప్రతీ చిన్న విషయాన్ని కూడా సుకుమార్ సినిమాల గురించి తెలుసుకునే ప్రయత్నం ఎక్కువగా చేస్తూ ఉంటారు టాలీవుడ్ జనం. మన తెలుగులో ప్రయోగాలు చేయడానికి ముందుకు వచ్చే దర్శకుడు ఎవరు అయినా ఉన్నారు అంటే అందులో సుకుమార్ ముందు వరుసలో ఉంటారు. టాలీవుడ్ లో ఆయన సినిమాలకు ఒక క్రేజ్ ఉంటుంది. 

 

రంగస్థలం సినిమా తర్వాత ఆయన సినిమాల మీద జనాలకు ఒకరకమైన ఆసక్తి ఉంది అనేది వాస్తవం. ఆ సినిమాను విమర్శకులు కూడా మెచ్చుకున్న సందర్భాలు ఉన్నాయి. టాలీవుడ్ లో ఆ సినిమా ఆ స్థాయిలో విజయం సాధించింది. ఆ సినిమాలో రామ్ చరణ్ లాంటి హీరోని గ్లామర్ లేకుండా చూపించాడు. ఇక సమంతా ను కూడా పూర్తి స్థాయి నటిగా మార్చాడు సుక్కు. ఇక అక్కడి నుంచి ప్రతీ సినిమాలో కూడా నటనకు ప్రాధాన్యత ఉండాలని కోరుతున్నారు హీరోలు దర్శకులు. ఇప్పుడు అతను చేస్తున్న పుష్పా సినిమా కోసం సుకుమార్ ఎక్కువగా కష్టపడుతున్నారట. 

 

టాలీవుడ్ లో అతను ఈ సినిమా చెయ్యాలని అల్లు అర్జున్ ని అడగడమే ఒక సంచలనం అయితే సినిమా ఫస్ట్ లుక్ లో అతన్ని చూపించిన తీరు నిజం గా అన్ని కూడా సంచలనం. ఆ విధంగా ఈ సినిమా ప్రేక్షకులకు ఒకరకమైన ఆసక్తిని పెంచింది అని అంటున్నారు. ప్రస్తుతం ఈ సినిమాలో అల్లు అర్జున్ పాత్రకు బన్నీ ని బాగా సిద్దం చేస్తున్నాడు. ఏ విధంగా నటించాలి అనే దాని  మీద ఆన్లైన్ క్లాసులు కూడా చెప్తున్నాడని సమాచారం. మరి బన్నీ ఏ విధంగా చేస్తాడో...

మరింత సమాచారం తెలుసుకోండి: