రాజమౌళి సినిమా అనగానే చాలా మంది హీరోలకు ఒక పండగ లాంటి వాతావరణం ఉంటుంది అనేది ఎవరూ కాదు అనేలేని వాస్తవం. ఎవరు అయినా సరే టాలీవుడ్ లో ఆయన తో ఒక్క అవకాశం వస్తే చాలు అనుకుని పండగ చేసుకుంటారు. ఆయన సినిమాల్లో అవకాశం రావడం అద్రుష్టం అని కూడా అనుకునే బ్యాచ్ ఉంది ఈ మధ్య కాలంలో. ప్రస్తుతం ఆయన ఆర్ఆర్ఆర్ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకి వచ్చే అవకాశం ఉంది. సంక్రాంతి కానుకగా ఈ సినిమాను విడుదల చేయడానికి దర్శక నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నారు. 

 

ఇప్పుడు ఈ సినిమా కథలో కొన్ని మార్పులు కావాలని కొందరు అడిగినట్టు సమాచారం. ముఖ్యంగా రామ్ చరణ్ తన పాత్ర విషయంలో కొన్ని మార్పులు కోరారని టాక్. సినిమాలో కొన్ని సీన్స్ కావాలని చిరంజీవి అడగడం తో ఆ సీన్స్ ని యాడ్ చెయ్యాలని ఆయన విజ్ఞప్తి చేసినట్టు టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఇది ఎంత వరకు నిజమో గాని ఆ కథ లో మార్పుల కోసం గత కొన్ని రోజులుగా రాజమౌళి కి ఫోన్ లు కూడా వస్తున్నాయని అంటున్నారు. అయినా సరే ఆయన మాత్రం ముందుకు వచ్చి కథలో మార్పులు చేయడానికి ఆసక్తి చూపించడం లేదు అని టాక్. 

 

ఎంత చెప్పినా సరే తనకు ఒక విజన్ ఉందని దాని ప్రకారమే తాను సినిమా చేస్తాను గాని తనకు ఎవరూ కూడా సలహాలు ఇవ్వకండి అని స్పష్టంగా చెప్పినట్టు సమాచార. సినిమా షూటింగ్ దాదాపు గా అయిపోయింది. ఈ తరుణంలో ఇప్పుడు మార్పులు చెయ్యాల్సిన అవసరం ఏంటీ అని ఆయన స్పష్టంగా అడిగినట్టు టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. టాలీవుడ్ లో ఇప్పుడు ఈ సినిమా... హాట్ టాపిక్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: