కరోనా మహమ్మారి వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో భారతదేశ ప్రజలంతా లాక్ డౌన్ లో మగ్గిపోతున్నారు. పేదవాళ్ల, మిడిల్ క్లాస్ ప్రజల పరిస్థితి దయనీయంగా మారింది. రెక్కాడితే గానీ డొక్కాడని ప్రజల కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తో పాటు ఎన్నో చారిటీ సంస్థలు నిత్యావసర సరుకులను అందించేందుకు ముందుకు వస్తున్నాయి. కానీ ఇవ్వన్నీ ప్రతి ఒక్కరికి నిత్యావసర సరుకులు, ఆహారం అందడం దాదాపు అసాధ్యం అని చెప్పుకోవచ్చు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాలలో ఎంతోమంది ఆకలితో అలమటిస్తున్నారు. అటువంటి వారి కోసమే టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ 25 లక్షల రూపాయలతో మిడిల్ క్లాస్ ఫౌండేషన్( ఎమ్.సి.ఎఫ్) ని ఏర్పాటు చేశాడు. తన సొంత ఫౌండేషన్ ద్వారా చాలా మంది పేద ప్రజలకు రూ. 1000 విలువైన నిత్యావసర సరుకులు అందుతాయని మన రౌడీ స్టార్ తెలిపాడు. అయితే తాను ఏర్పాటు చేసిన మిడిల్ క్లాస్ ఫండ్ కి తన అభిమానులు కూడా చేతనైనంత డబ్బులు ట్రాన్స్ఫర్ చేయవచ్చు. ఒకవేళ మీరు విజయ్ దేవరకొండ పౌండేషన్ ద్వారా పేద ప్రజలకు నిత్యావసర సరుకులు అంద చేయాలనుకుంటే www.thedeverakondafoundation.org వెబ్సైటు విజిట్ చేసి మీ విలువైన విరాళాన్ని అందచేయొచ్చు. 

 


ఇప్పటికే చాలా మంది అభిమానులు మిడిల్ క్లాస్ ఫండ్ కు ఎన్నో విరాళాలు అందజేశారు. తాజాగా ఆర్ఎక్స్100 కథానాయకుడు కార్తికేయ అక్షరాల లక్ష రూపాయలను ఎమ్.సి.ఎఫ్ కు విరాళంగా ఇచ్చాడు. 'మీ పనులను గౌరవించడం తప్ప చెప్పడానికి ఇంకేమి ఏమీ లేదు, అన్న. మిడిల్ క్లాసు వారి దురవస్థ, నిరుద్యోగం మనకి పెద్ద సమస్యలుగా మారాయి. వారికి సహాయంగా నా తరఫున లక్ష రూపాయలను విరాళంగా ఇస్తున్నాను. అలాగే ప్రతి ఒక్కరూ తమకు సహాయం చేతనైనంత సహాయం మిడిల్ క్లాస్ ఫౌండేషన్ ద్వారా చేయాలని కోరుకుంటున్నా' అని కార్తికేయ తన ట్విటర్ ఖాతా ద్వారా వెల్లడించాడు. 

 

 


అయితే ఇంత సహాయం చేసిన ఆర్ఎక్స్ 100 హీరో కి ధన్యవాదాలు తెలిపాడు విజయ్. ' డార్లింగ్, నీ సహాయం వలన 100 కుటుంబాలకి నిత్యావసర సరుకులు అందుతాయి. బిగ్ హగ్స్', అంటూ కార్తికేయ చేసిన సహాయాన్ని మెచ్చుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: