టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి. బాహుబలి సినిమా తో టాలీవుడ్ ఇండస్ట్రీకి మాత్రమే కాక భారతీయ చలన చిత్ర రంగం యొక్క కీర్తిని అంతర్జాతీయ స్థాయిలో దమ్మేంటో నిరూపించాడు. ఇప్పటిదాకా టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర ఒక్క పరాజయం కూడా లేదు. ఇటువంటి ఎస్ ఎస్ రాజమౌళి కి టాలీవుడ్ ఇండస్ట్రీలో నచ్చే డైరెక్టర్ ఎవరు అని ఏ సందర్భంలో అయినా ప్రశ్నిస్తే టక్కున చెప్పే పేరు లెక్కల మాస్టర్ డైరెక్టర్ సుకుమార్. ఆయన పనితనం అంటే తనకు చాలా ఇష్టమని రాజమౌళి ఎప్పుడు సుకుమార్ డైరెక్షన్ గురించి చెబుతుంటారు. అయితే ఇటీవల రాజమౌళి ఆస్కార్ అవార్డు గెలిచిన కొరియన్ మూవీని విమర్శించడంతో సోషల్ మీడియాలో అందరికీ టార్గెట్ గా మారారు.

 

ఈ సందర్భంగా నెటిజన్లు రాజమౌళి తర్వాత డైరెక్టర్ గురించి పెద్ద డిస్కషన్స్ పెట్టుకున్నారు. రాజమౌళి తర్వాత వినబడిన డైరెక్టర్ ల పేర్లు ఎక్కువగా సుకుమార్ మరియు త్రివిక్రమ్. ఇక త్రివిక్రమ్ విషయానికి గురించి నెటిజన్లు మాట్లాడుకుంటున్నా ఈ సందర్భంలో ఆయన మాటలు మరియు పంచులు బాగానే రాసిన గాని ఒరిజినాలిటీ ఏమీ ఉండదని..చాలా వరకు తీసిన సినిమాలు కాపీ సినిమాలని డిస్కషన్ చేసుకున్నారు. స్టోరీలు కూడా ఇంగ్లీషు నవలల ఆధారంగా లేకపోతే వేరొక భాష నవల ఆధారంగా తీసుకొని తెలుగులో ఏదో పెద్ద ఘనకార్యం చేసినట్టు సినిమా చేస్తారని చాలామంది త్రివిక్రమ్... రాజమౌళి తర్వాత పెద్ద ఏమీ కాదని పక్కన పెట్టేశారు.

 

కానీ డైరెక్టర్ సుకుమార్ విషయంలో చాలా మంది నెటిజన్లు ఒరిజినాలిటీ కి కేరాఫ్ అడ్రస్ సుకుమార్ అని తేల్చారు. దిగ్గజ దర్శకుడు రాజమౌళి తీసిన సినిమాలలో కొన్ని సన్నివేశాలు కాపీ జరిగిన సందర్భాలు ఉంటాయి గాని సుక్కు యాక్షన్ ఘట్టాల చిత్రీకరణలో ఎప్పుడూ కొత్తదనం కనిపిస్తుంది అంటూ నెటిజన్లు ఎక్కువగా సుకుమార్ దర్శకత్వానికి మద్దతు పలికారు. ఒక విధంగా చెప్పాలంటే డైరెక్టర్ సుకుమార్ నంబర్ వన్ డైరెక్టర్ ఆఫ్ టాలీవుడ్ ఇండస్ట్రీ అని చాలామంది అంటున్నారు. ప్రతి సినిమాలో ఒరిజినాలిటీ, వైవిద్యం, కొత్తదనం చూపించాలంటే సుకుమార్ తర్వాత మాత్రమే మిగతా వాళ్ళు అని ఘంటాపథంగా చెబుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: