మల్టీస్టారర్ సినిమా అంటే ఎన్ని ఇబ్బందులు ఉంటాయో అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే ఒక హీరోకి కుదిరితే ఇంకో హీరోకి డేట్లు కుదరకపోవచ్చు. అలాగే వారి మధ్య ఎలాంటి గొడవలు జరగకుండా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే సినీ ఇండస్ట్రీ పుట్టినప్పుడు అప్పటి జనరేషన్ హీరోలు ఎన్టీఆర్, నాగేశ్వరరావు, కృష్ణంరాజు, శోభన్ బాబు, కృష్ణ హీరోలందరూ కలిసి మల్టీస్టారర్ సినిమా చేసిన వారే. కానీ కొన్ని రోజుల క్రితం వరకు ఇప్పుడు జనరేషన్ హీరోలు మల్టీస్టారర్ మూవీస్ అంటే ఎందుకు ఆలోచించేవారు. అయితే ప్రస్తుతం ఈ సిచువేషన్ మారింది అని చెప్పుకోవచ్చు. 


సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా కోసం సూపర్ స్టార్ మహేష్ బాబు, టాలీవుడ్ టాప్ హీరో విక్టరీ వెంకటేష్ లాంటి హీరోలు చేయడానికి ముందుకు వచ్చారు. ఇక అంతే ఆ తర్వాత నందమూరి హీరో ఎన్టీఆర్, మెగా హీరో రామ్ చరణ్ కలిసి ఆర్ఆర్ఆర్ సినిమాకు ముందుకు వచ్చి సినిమా చేస్తున్నారు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు తర్వాత చాలామంది మల్టీ స్టారర్ మూవీస్ తీయడానికి ముందుకు వస్తున్నారు. అయితే ఆర్ఆర్ఆర్ సినిమా దర్శకుడు రాజమౌళి ఇద్దరు బడా హీరోలను ఒప్పించి ఒకే సినిమాలో నటించడం అంత సాధ్యమయ్యే సంగతి కాదు కానీ వారిద్దరిని ఒప్పించి భారీ మల్టీస్టారర్ సినిమా చేస్తున్నారు.

 

అయితే ఇక అసలు విషయానికి వస్తే సీనియర్ దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు చాలా సంవత్సరాల క్రితమే భారీ మల్టీస్టారర్ ప్లాన్ చేశారట. ఆ సినిమాని రాఘవేంద్రరావు తన కెరీర్లో మైల్ స్టోన్ అయిన 100వ చిత్రంగా ఒక భారీ మల్టీస్టారర్ చేయాలి అనుకున్నారట. అయితే ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున, విక్టరీ వెంకటేష్ ను హీరోగా పెట్టి సినిమా తీయాలని అనుకున్నారు. ఈ సినిమాకి "త్రివేణి సంగమం" అని కూడా టైటిల్ ని ఫిక్స్ చేశారట అప్పట్లో. అయితే అప్పుడు కొన్ని సందర్భాల్లో కుదరక తన 100 చిత్రం గంగోత్రిని విడుదల చేశారు రాఘవేంద్రుడు. అయితే అప్పుడు తన ప్రాజెక్టుని తెరకెక్కించాలని గట్టి పట్టుదలతో ఉన్న రాఘవేంద్రరావు అప్పుడు కుదరక ఇప్పుడు ఆ బాధ్యతలను తన తనయుడు ప్రకాష్ కోవెలమూడి అప్పగించాలని చూస్తున్నట్లు వస్తోంది. అయితే ఈ సినిమా చేస్తే టాలీవుడ్ లో రికార్డులను ప్రభంజనం సృష్టించడం ఖాయం.

మరింత సమాచారం తెలుసుకోండి: