కరోనా కారణంగా ప్రజలు వణికి పోతున్నారు. కరోనా ప్రభావాన్ని తగ్గించడానికి  కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలను తీసుకుంటుంది. ఈ మేరకు లాక్ డౌన్ విధించింది ..  దీంతో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. దాంతో వ్యాపార , వాణిజ్య సంస్థలు స్వచ్చందంగా మూతపడ్డాయి. రవాణా వ్యవస్థ రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. 

 

 

 


కరోనా కారణంగా పూత గడవని రోజువారీ కార్మికులను ఆదుకోవడానికి  సినీ రాజకీయ ప్రముఖులు ముందుకొస్తున్నారు. అంతేకాకుండా సేవ కార్యక్రమాల సంస్థలు కూడా ముందుకొస్తున్నాయి.  సినిమా ఇండస్ట్రీలో పరిస్థితి మాత్రం మరి దారుణంగా మారింది. విడుదల కావలసిన సినిమాలు ఆగిపోయాయి..  షూటింగ్ జరుపుకుంటున్న సినిమాలు షూటింగ్ ను  ఆపివేశాయి. 

 

 

 


ఇది ఇలా ఉండగా తమిళ నటుడు సూర్య సినిమాలను విడుదల చేయడానికి నో అన్న వార్త ఫిలిం నగర్లో  చక్కర్లు కొడుతుంది.  ఆయన తీసే సినిమాలను థియేటర్లలో ఆడనివ్వడానికి థియేటర్ యాజమాన్యాలు నో చెప్పాయట..నటి జ్యోతిక నటించిన సినిమా ‘పోన్ మగల్ వందల్‌’. 2డీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్య సినిమాను నిర్మించారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఈ సినిమాను థియేటర్‌లో విడుదల చేయడం లేదని, మే మొదటి వారంలో నేరుగా ఓటీటీ ఫ్లాట్‌ఫాంలో విడుదల చేయబోతున్నామని దర్శక, నిర్మాతలు చెప్పారు. అమెజాన్‌ ప్రైమ్‌లో సినిమా అందుబాటులోకి రాబోతోంది.

 

 

 

 

తమిళనాడు థియేటర్‌ యజమానులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘‘పోన్ మగల్ వందల్‌’ సినిమాను నేరుగా ఓటీటీ ఫ్లాట్‌ఫాంలో విడుదల చేయబోతున్నారని తెలిసి షాక్‌ అయ్యాం. ఎప్పుడైనా సరే సినిమాను ముందు థియేటర్‌లో విడుదల చేయాలి, ఆపై మిగిలిన ఫ్లాట్‌ఫాంలలో అందుబాటులోకి తీసుకురావాలి. మేం నిర్మాతల్ని కలిసి మాట్లాడం. తమ నిర్ణయాన్ని మార్చుకోమని కోరాం.. కానీ వారు మా మాట వినలేదు. మొత్తానికి సూర్య సినిమాలకు గండి పడనుంది అని స్పష్టంగా కనబడుతున్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి: