నందమూరి తారక రామారావు బయోపిక్ గా తెరకెక్కిన ఎన్టీఆర్ కథానాయకుడు' 'ఎన్టీఆర్ మహానాయకుడు' ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఆ తర్వాత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత కథలోని పాదయాత్రను ఆధారంగా చేసుకుని మహి వి రాఘవ ‘యాత్ర’ అనే సినిమా తీసిన సంగతి తెలిసిందే. రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర చేయడానికి పురుగొల్పిన అంశాలు, ఆయన చేసిన పాదయాత్ర, చివరికి ఎలా ముగిసింది, ఆయన ముఖ్యమంత్రి కావడం, చనిపోవడం వంటి అంశాలు ‘యాత్ర’లో దర్శకుడు ప్రస్తావించారు. అప్పుడే రాజశేఖర్ రెడ్డి తనయుడు ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డి రాజకీయ ప్రయాణం నేపథ్యంలో ‘యాత్ర 2’ సినిమాను తెరకెక్కిస్తానని ప్రకటించాడు మహి వి రాఘవ.

 

IHG

 

‘వైఎస్‌ రాజా రెడ్డి, వైఎస్‌ జగన్‌ గురించి చెప్పకుండా వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి కథ పూర్తి కాదు. ‘యాత్ర 2’ ఆయన కథను పరిపూర్ణం చేస్తుంది. వైఎస్సార్ యాత్ర తన తండ్రి సమాధి దగ్గర నుండి ప్రారంభమైంది. అలాగే జగన్‌ యాత్ర కూడా ప్రారంభమైంది’ అని రాఘవ్ వెల్లడించిన విషయం తెలిసిందే. మన మధ్య ఉన్న వ్యక్తి బయోపిక్ తీస్తే జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారన్నదే సందేహంగా మారింది. అంతేకాకుండా అసలు జగన్ జీవితంలో సినిమా తీసేంత స్టోరీ ఉందా అన్న సందేహాలు కూడా జనాల్లో ఉన్నాయి. ఇదే విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో మహిని అడిగితే సీఎం జగన్ కథలో ‘గాడ్ ఫాదర్’ రేంజ్ విషయం ఉందని కామెంట్ చేసాడట. వైఎస్ కథను సినిమాగా చేయడానికి కష్టపడాలేమో కానీ.. జగన్ విషయంలో ఆ ఇబ్బంది లేదని అన్నాడట. హీరోయిజంతో పాటు కష్టాలు.. దరిద్రం.. పోరాటం ఉన్నాయని.. జగన్ జీవిత కథతో సినిమా తీస్తే మంచి ఎమోషనల్ జర్నీ అవుతుందని మహి చెప్పాడట. ముందు రెండు వెబ్ సిరీస్‌లు, ఓ సినిమా చేసి ఆ తర్వాత అన్నీ కుదిరితే జగన్ బయోపిక్‌ పట్టాలెక్కిస్తానని మహి తెలిపాడట.

 

IHG

మరింత సమాచారం తెలుసుకోండి: