స్టార్ హీరోలతో సినిమాలు చేస్తే హీరోయిన్ల గ్రాఫ్ లో బోల్డన్ని మార్పులొస్తాయి. భారీ సినిమాలతో టాప్ హీరోయిన్ గా మారే అవకాశం ఉంటుంది. అందుకే స్టార్ హీరోతో సినిమా అంటే చాలు కాల్షీట్స్ ఇచ్చేందుకు సిద్దంగా ఉంటారు హీరోయిన్లు. కానీ ఈ మధ్య టాలీవుడ్ టాప్ హీరోలకు కూడా హీరోయిన్లు దొరకడం లేదు. 

 

పవన కళ్యాణ్ తో సినిమా చేసేందుకు దర్శకులు ఎంతగా ట్రై చేస్తారో.. హీరోయిన్లు కూడా అదే రేంజ్ లో ఆశపడుతుంటారు. పవర్ స్టార్ తో సినిమా చేసి, స్టార్ రేసులో దూసుకెళ్లాలని ప్రయత్నిస్తుంటారు. అయితే పవన్ రీఎంట్రీ మూవీ వకీల్ సాబ్ కి మాత్రం ఇంకా హీరోయిన్ సెట్ అవడం లేదు. ఎక్స్ టెండెడ్ క్యామియే తరహాలో ఉండే వకీలమ్మ పాత్రకు స్టార్ హీరోయిన్లు ఎవరూ ఇంట్రెస్ట్ చూపించడం లేదు. 

 

పవన్ కళ్యాణ్- క్రిష్ కాంబినేషన్ లో ఓ పీరియాడికల్ డ్రామా తెరకెక్కుతోంది. 250కోట్లకు పైగా బడ్జెట్ తో పాన్ ఇండిన్ మూవీగా వస్తోంది సినిమా. ఇక ఈ సినిమాకు ఇప్పటి వరకు హీరోయిన్ కన్పార్మ్ కాలేదు. బాలీవుడ్ మార్కెట్ కుకూడా సెట్ అయ్యేలా జాక్వెలిన్ ఫెర్నాండేజ్ లాంటి వాళ్లను కాంటాక్ట్ చేస్తున్నారనే ప్రచారం జరిగింది కానీ.. క్రిష్ ఇంకా ఎవరినీ కన్పార్మ్ చేయలేదు.

 

రామ్ చరణ్ కు హీరోయిన్ కష్టాలు తప్పడం లేదు. తండ్రి చిరంజీవితో కలిసి నటిస్తోన్న ఆచార్యలో చరణ్ కు ఇంకా పెయిర్ కన్ఫార్మ్ కాలేదు. త్రిష వెళ్లిపోయాక చిరుకి జోడీగా కాజల్ ను తీసుకొచ్చిన యూనిట్, ఇప్పుడు చరణ్ కోసం సెర్చింగులు చేస్తోంది. ఇక ఆచార్య రామ్ చరణ్ క్యారెక్టర్ ఎక్స్ టెండెడ్ క్యామియోలాగా ఉంటుంది. సో చరణ్ కు స్క్రీన్ స్పేస్ తక్కువగా ఉంటుందని కాబట్టి..ఇతనితో జోడీ కట్టే హీరోయిన్ కు స్పేస్ తక్కువగానే ఉంటుంది. మరి స్పెషల్ రోల్ లాంటి క్యారెక్టర్ కు ఎవరు ఓకే చెబుతారో చూడాలి. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: