టాలీవుడ్ హీరోలు కేవ‌లం న‌ట‌న‌కే ప‌రిమితం కాకుండా సినిమాల్లో న‌టించ‌డ‌మే కాకుండా సైడ్ బిజినెస్‌లు కూడా చేస్తున్నారు. ఇప్ప‌టికే చాలా మంది సెల‌బ్రెటీలు వారికి ఇంట్ర‌స్ట్‌గా ఉన్న రంగాలను ఎంచుకుంటూ సైడ్ బిజినెస్‌లుగా పెట్టుకుంటున్నారు. ఒకొక్క‌రు ఒక్కోదాంట్లో పెట్టుబ‌డులు పెడుతూ ఆయా రంగాల్లో దూసుకుపోతున్నారు. ఇతర ప్రచార కార్యక్రమాల ద్వారా మాత్రమే ఆదాయాన్ని అర్జించేవారు. కానీ ఇప్పుడు ఇంకా ఎక్కువ ఇతర మార్గాలను ఎంచుకుంటున్నారు. అలాగే తాము సంపాదించిన సొమ్ముతో స్థిరాస్తుల కొనుగోలు చేస్తున్నారు. బంగారం, ఫిక్స్ డ్ డిపాజిట్లు ఇలా పరిమితమైన సాధనాల్లో మాత్రమే పొదుపు చేసేవారు. అవసరమైన సొమ్మును మాత్రం వినియోగించేవారు. కానీ నేటి తరం సెలబ్రెటీలు ఇందుకు భిన్నంగా ఆలోచిస్తున్నారు. నేరుగా వ్యాపారాల్లోకి దిగుతున్నాయి. చురుకైన భాగస్వాములుగా మారి వ్యాపారాలను ప్రమోట్ చేసుకుంటున్నారు.

 

అక్కినేని నాగార్జున ఆ పేరు వింటే ముందు గుర్తువ‌చ్చేది టాలీవుడ్ మన్మథుడు, కింగ్ నాగార్జున తన విలక్షణమైన కథనలను ఎంచుకుంటూ తన నటనతో సినిమాల్లో తానేంటో నిరూపించుకున్నాడు. ఓ వైపు హీరోగా.. మరోవైపు యాంకర్ గా.. ఇంకోవైపు నిర్మాతగా కోట్ల రూపాయలు సంపాదిస్తున్న నాగార్జున ఇంకా ఇతర రంగాల్లో కూడా పెట్టుబడులు పెట్టి లాభాలను గడిస్తున్నారు. నార్మ‌ల్‌గా నాగార్జున పెద్ద బిజినెస్ మ్యాన్ అని అంద‌రూ చెబుతుంటారు.

 

ఇంకా నాగార్జున చ‌దివింది కూడా బిజినెస్‌కి సంబంధించిన‌దే లండ‌న్ వెళ్ళి బిజినెస్ మ్యానేజ్‌మెంట్  నేర్చుకుని వ‌చ్చారు. ఎన్ గ్రిల్ రెస్టారెంట్, అలాగే ఎన్ కన్వెన్షన్ సెంటర్లు అలాగే కేరళ బ్లాస్టర్స్ జట్టుకు సైతం కో ఓనర్ గా వ్యవహరిస్తున్నారు. ఇక స్టార్ మా లో పెట్టుబుడులు పెట్టిన సంగతి అందరికీ తెలిసిందే. తను పెట్టుబడి పెట్టడమే కాకుండా చిరంజీవితో సైతం అందులో కొంత పెట్టుబడి పెట్టేందుకు ఒప్పించారు. అలాగే క‌ళ్యాణ్ జూవెల‌ర్స్‌లో కూడా ఆయ‌న‌కు షుర్ ఉన్న‌ట్లు స‌మాచారం. ఇంకా రియ‌ల్ ఎస్టేట్‌లో పెట్టుబ‌డులు పెట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: