టాలీవుడ్ నేటితరం సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పటికే వరుసగా విజయాలతో దూసుకెళ్తూ ప్రతి ఒక్క సినిమాతో అత్యద్భుతమైన క్రేజ్ ని ఫ్యాన్స్ ని పెంచుకుంటూ ముందుకు సాగుతున్నారు. గడచిన రెండేళ్లలో ఆయన నటించిన భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకివ్వరు సినిమాలు మూడు కూడా సక్సెస్ లు అందుకున్న విషయం తెలిసిందే. ఇక అతి త్వరలో తన నెక్స్ట్ మూవీ ని యువ దర్శకుడు పరశురామ్ దర్శకత్వంలో చేయనున్నారు మహేష్. మరోవైపు మహేష్ మాదిరిగానే విజయాలతో దూసుకెళ్తున్న సీనియర్ నటుడు విక్టరీ వెంకటేష్. గత ఏడాది ఎఫ్ 2 తో పాటు వెంకీ మామ సినిమాలతో రెండు సక్సెస్ లు తన ఖాతాలో వేసుకున్న వెంకీ, ప్రస్తుతం తమిళ మూవీ అసురన్ కు అధికారిక తెలుగు రీమేక్ గా తెరకెక్కుతున్న నారప్ప సినిమాలో హీరోగా నటిస్తున్నారు. 

 

ప్రస్తుతం లాక్ డౌన్ ఎఫెక్ట్ తో ఆ సినిమా షూటింగ్ ఆగిపోయింది. కాగా నేడు కొన్ని ఫిలిం నగర్ వర్గాల నుండి అందుతున్న సమాచారాన్ని బాతి చూస్తుంటే, అతి త్వరలో మరొక్కసారి ఈ ఇద్దరు హీరోలు కలిసి నటించే అవకాశం ఉందని అంటున్నారు. గతంలో యువ దర్శకడు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వచ్చిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో ఈ ఇద్దరు హీరోలు కలిసి నటించిన విషయం తెలిసిందే. అప్పట్లో ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన ఆ సినిమా సూపర్ హిట్ కొట్టింది. ఇకపోతే అతి త్వరలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో తన తదుపరి సినిమాని తీయనున్న మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, ఆపై తీయబోయే సినిమా విషయమై ప్రస్తుతం ఒక పవర్ఫుల్ స్టోరీ ని సిద్ధం చేస్తున్నట్లు టాక్. వాస్తవానికి గతంలో కొన్నాళ్ల క్రితమే త్రివిక్రమ్, వెంకీ ల కాంబోలో ఒక సినిమా రావలసింది, అయితే కొన్ని అనివార్య కారణాల వలన అది ఆగిపోయిందని సమాచారం. 

 

అలానే మరోవైపు మహేష్ తో కూడా త్రివిక్రమ్ పని చేయాల్సి ఉండగా, అది కూడా కుదరలేదు. కాగా ప్రస్తుతం మహేష్ కోసం రాస్తున్న స్టోరీ లో హీరోతో పాటు మరొక పవర్ఫుల్ పాత్ర ఉందని, ఆ పాత్ర కోసం విక్టరీ వెంకటేష్ ని తీసుకోవాలని యోచిస్తున్నాడట త్రివిక్రమ్. వాస్తవానికి ఎప్పటినుండో ఈ ఇద్దరు హీరోలతో సినిమా తీద్దాం అని భావిస్తున్న తనకు, ఈ సినిమా తీసే అవకాశం లభిస్తే, వారిద్దరికీ కలిపి ఒకేసారి మంచి హిట్ ఇచ్చిన సంతృప్తి తనకు ఉంటుందని ఆలోచన చేస్తున్నారట త్రివిక్రమ్. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తలో నిజానిజాలు ఎంతవరకు ఉన్నాయో తెలియదుగాని, ఒకవేళ ఇదే కనుక నిజం అయితే మాత్రం, మరొక్కసారి చిన్నోడు, పెద్దోడు ఇద్దరినీ కూడా టాలీవుడ్ తెరపై చూడవచ్చన్నమాట......!!

మరింత సమాచారం తెలుసుకోండి: