ప్రస్తుతం ఎంతో వేగంగా నడుస్తున్న కాలం తో పాటు మనం కూడా వేగవంతంగా నడవక తప్పని పరిస్థితులు వచ్చేసాయి. అలానే నేటి యువత కూడా కేవలం ఒకే ఒక్క అవకాశాన్ని కాకుండా పలు విధాలైన ఆదాయ మార్గాల పై దృష్టి పెడుతూ ముందుకు సాగుతున్నారు. దానికి ప్రధాన కారణం ఖర్చులు, ధరలు పెరగడంతో పాటు ఎప్పటికప్పుడు అవసరాలు కూడా మరింతగా ఉండడం. దీనితో అన్ని రంగాల్లోని వారిలో దాదాపుగా చాలా మంది, కేవలం ఒకవిధంగానే కాక పలు ఆదాయ మార్గాల వైవు చూస్తున్నారు. ఆ విధంగా ప్రస్తుతం టాలీవుడ్ లోని కొందరు నటీనటులు కూడా కొంత ముందుకు దూసుకెళ్తున్నారు అనే చెప్పాలి. 

 

ఇక ప్రస్తుతం కొత్తగా టాలీవుడ్ కి ఎంట్రీ ఇస్తున్న వారు సైతం, భవిష్యత్తులో ఏ మాత్రం ఇబ్బందులు లేకుండా ఉండేందుకు పలు ఇతర ఆదాయమార్గాలు కూడా ఎంచుకుంటున్నారు. ఆ విధంగా ముందుకు సాగుతున్న వారిలో యువ నటుడు మంచు విష్ణు కూడా ఒకరు అని చెప్పకతప్పదు. నటుడు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు పెద్ద తనయుడైన విష్ణు, ముందుగా విష్ణు సినిమాద్వారా కొన్నేళ్ల కారితం సినిమా రంగప్రవేశం చేయడం జరిగింది. ఇక ఆ తరువాత నుండి ఒక్కొక్కటిగా వస్తున్న అవకాశాలతో ముందుకు సాగిన విష్ణు ఇటీవల వివాహం అనంతరం మెల్లగా తన తండ్రి నెలకొల్పిన శ్రీ విద్యానికేతన్ స్కూల్ తో పాటు తాను స్వంతంగా స్థాపించిన 24 ఫ్రేమ్స్ ఫిలిం ఫ్యాక్టరీ, అలానే ఇటీవల హైదరాబాద్ లో స్థాపించిన టాప్ క్వాలిటీ స్కూల్స్ ని సైతం ఎంతో సమర్ధవంతంగా నిర్వహిస్తూ ముందుకు సాగుతున్నారు. 

 

తన చిన్న తనయుడు మనోజ్ కు ఎక్కుగా సినిమాలపై దృష్టి ఉంటుందని, అదే విష్ణు అయితే అటు సినిమాలతో పాటు ఇటు బిజినెస్ లు కూడా సమర్ధవంతంగా నేర్పుతో ముందుకు నడిపిస్తాడని ఇటీవల మోహన్ బాబు ఒక ఇంటర్వ్యూ లో భాగంగా చెప్పడం జరిగింది. అలానే మరోవైపు కుటుంబాన్ని కూడా చక్కగా చూసుకుంటే, ఇటు సినిమాలు, అటు బిజినెస్ లు కూడా హ్యాండిల్ చేస్తూ ప్రస్తుతం మంచి పేరు, ఆదాయంతో దూసుకెళ్తున్న విష్ణు నేటి యువ హీరోల్లో మరెందరికో ఆదర్శం అని అంటున్నారు సినీ విశ్లేషకులు......!!

మరింత సమాచారం తెలుసుకోండి: