ప్రేమ కాన్సెప్ట్ తో ఎన్ని సినిమాలు వచ్చినా ప్రేక్షకులకు బోర్ కొట్టవు. ప్రతి ఏజ్ గ్రూప్ కు లవ్ సబ్జెక్ట్ ఇచ్చే కిక్ అలాంటిది. అలాంటి లవ్ సబ్జెక్టుకు పర్ఫెక్ట్ హీరో, హీరోయిన్, దర్శకుడి మేకింగ్ తోడైతే క్లాసిక్స్ గా నిలిచిపోతాయి. అటువంటి అరుదైన క్లాసికల్ వండర్ మూవీ ‘ఖుషి’. పవన్ కల్యాణ్, భూమిక నటించిన ఈ సినిమా విడుదలై నేటితో 19 ఏళ్లు పూర్తయ్యాయి. 2001 ఏప్రిల్ 27న విడుదలైన ఖుషి అప్పటివరకూ ఉన్న రికార్డులను బద్దలుకొట్టి ఏకంగా ఇండస్ట్రీ హిట్ సాధించింది.

IHG

 

లవ్ సబ్జెక్టు మూవీ ఇండస్ట్రీ హిట్ సాధించడం విశేషం. విడుదలైన ప్రతి చోటా కలెక్షన్ల వర్షమే. పవన్, భూమిక గిల్లికజ్జాలకు యూత్ బాగా కనెక్ట్ కావడంతో రాష్ట్రంలోని ప్రతి థియేటర్ ఓ లవర్స్ పార్క్ అయిపోయింది. ఇద్దరు ప్రేమికులను కలిపే క్రమంలో హీరో, హీరోయిన్ల మధ్య ప్రేమ డెవలప్ అవటం చాలా కొత్తగా అనిపించింది. కాలేజీ స్టూడెంట్ గా పవన్ స్టైల్ ఆఫ్ యాక్టింగ్, డైలాగ్ డిక్షన్ అప్పట్టో యూత్ కు పూనకాలు తెప్పించింది. ‘లైట్ తీస్కో’ అనే మాట ఈ సినిమా నుంచే పాపులర్ అయింది. ఈ సినిమాతో రాష్ట్రమంతా పవన్ మ్యానియాతో ఊగిపోయింది.

IHG

 

‘ఇగో’ కాన్సెప్ట్ మీదే సినిమా మొత్తం రన్ అయినా ఎక్కడా ప్రేక్షకులకు బోర్ కొట్టలేదు. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం ప్రాణం. ప్రతి పాట, బ్యాక్ గ్రౌండ్ స్కోరింగ్ ఆడియన్స్ ను కట్టిపడేశాయి. పీసీ శ్రీరామ్ తన ఫోటోగ్రఫీతో మాయాజాలమే చేశాడు. ఏఎం రత్నం నిర్మాణంలో ఎస్ జె సూర్య దర్శకత్వం వహించిన ఈ మూవీ 79 సెంటర్లలో 100 రోజులు, 8 సెంటర్లలో 175 రోజులు రన్ అయింది. పవన్ తో సహా అందరికీ ‘ఖుషి’ ఓ ల్యాండ్ మార్క్ గా నిలిచిపోయింది.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: