నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా వరుస సినిమా లు చేస్తూనే నిర్మాతగా కూడా కొనసాగుతున్నాడు. ఇప్పటివరకు తన సినిమాలనే నిర్మించిన కళ్యాణ్ రామ్,  ఎన్టీఆర్ తో జై లవ కుశ సినిమా నిర్మించాడు. సినిమా సెలబ్రిటీస్ కేవలం సినిమాలు చేయడమే కాకుండా సైడ్ బిజినెస్ లు చేస్తుంటారు. సినిమాల్లో వచ్చిన డబ్బుని వేరే బిజినెస్ మీద పెడుతుంటారు. కళ్యాణ్ రామ్ ఇప్పటికే నిర్మాతగా సక్సెస్ ఫుల్ సినిమాలు చేస్తుండగా.. సెపరేట్ గా ఒక బిజినెస్ స్టార్ట్ చేశాడు. అయితే కళ్యాణ్ రామ్ బిజినెస్ కూడా సినిమాలకు ఉపయోగపడేదే.. అదేంటి అంటే VFX వర్క్ బిజినెస్ లో దిగాడు ఈ నందమూరి హీరో. 

 

అద్వైత క్రియేటివ్ స్టూడియో పేరుతో కళ్యాణ్ రామ్ VFX వర్క్ బిజినెస్ స్టార్ట్ చేశాడు. ఇప్పుడు ప్రతి సినిమాకు VFX వర్క్ చాలా అవసరం అయ్యింది. అందుకే సినిమాకు కావాల్సిన ఈ బిజినెస్ లోకి దిగారు కళ్యాణ్ రామ్. 2014లో కళ్యాణ్ రామ్ అద్వైత క్రియేటివ్ స్టూడియోని స్టార్ట్ చేశారు. ఇప్పటికే చాలా సినిమాలకు ఇక్కడే VFX వర్క్ జరగడం విశేషం. సినిమాల్లో సంపాదించిన డబ్బుని సినిమాల్లోనే ఖర్చు పెట్టాలని ఇప్పటికే నిర్మాతగా కొనసాగతున్న కళ్యాణ్ రామ్ ఇప్పుడు vfx బిజినెస్ లో కూడా దిగి సక్సెస్ అందుకున్నాడు.      

 

హీరోగా కళ్యాణ్ రామ్ తన పంథాలో సినిమాలు చేస్తూ వెళ్తున్నాడు. ఈ ఇయర్ మొదట్లో వచ్చిన ఎంత మంచివాడవురా సినిమా నిరాశ పరచింది. ఈ సినిమా తర్వాత ప్రస్తుతం రెండు సినిమాలు లైన్ లో పెట్టాడు కళ్యాణ్ రామ్.. క్రేజీ సినిమాలతో వస్తున్న కళ్యాణ్ రామ్ బిజినెస్ లో కూడా మరెన్నో సక్సెస్ లు అందుకోవాలని ఆశిద్దాం. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లో నందమూరి మల్టీస్టారర్ తీయాలని ఉత్సాహంగా ఉన్నాడు కళ్యాణ్ రామ్. మరి అది ఎప్పటికి సాధ్యపడుతుందో చూడాలి. హీరో గా నిర్మాతగా కాదు బిజినెస్ మెన్ గా కళ్యాణ్ రామ్ సూపర్ అనిపించుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: