అర్జున్ రెడ్డి, ఆరెక్స్ 100 ఈ రెండు సినిమాల గురించి ప్రత్యేకంగా ఇంట్రడక్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. రెండు సినిమాలు యూత్ ఆడియెన్స్ ను బాగా ఆకట్టుకున్నాయి. అర్జున్ రెడ్డి సినిమాతోనే విజయ్ స్టార్ క్రేజ్ తెచ్చుకోగా మొదటి సినిమా ఎవరికీ తెలియకపోయినా ఆరెక్స్ 100 సినిమాతో కార్తికేయ యువ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కరోనా ఎఫెక్ట్ తో స్టార్స్ సైతం నిత్యావసరాలు ఇబ్బంది పడుతున్న ప్రజలకు సహాయపడేందుకు కృషి చేస్తున్నారు. 

 

అందరి కన్నా కొత్తగా ఆలోచించే విజయ్ దేవరకొండ ఈ కరోనా క్రైసిస్ వల్ల నిత్యావసరాలు బాగా ఇబ్బంది పడుతున్న వారికి సహాయంగా 1.3 కోట్ల రూపాయలను ఖర్చు విరాళంగా ఇస్తున్నారు. నిత్యావసరాలు ఇబ్బంది పడుతున్న వారు www.thedeverakondafoundation.org లో ఇచ్చిన లెటర్ లో తమ డీటైల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆధార్ కార్డు, ఫోన్ నంబర్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. విజయ్ దేవరకొండ ఫౌండేషన్ వారు కాల్ చెస్ మీరు తీసుకున్న సరుకులకు ఎమౌంట్ పే చేస్తారు. 

 

విజయ్ దేవరకొండ చేస్తున్న ఈ పనికి ఫిదా అయినా ఆరెక్స్ 100 హీరో కార్తికేయ.. తన సహాయంగా 1 లక్ష రూపాయలను విజయ్ దేవరకొండ ఫౌండేషన్ కు విరాళంగా ఇస్తున్నా అని ప్రకటించారు. మిడ్ క్లాస్ ఫండ్ అంటూ దేవరకొండ ఆలోచన చాలా బాగుందని అందరు అంటున్నారు. తన సినిమాలే కాదు తాను చేసే పనులు కూడా కొత్తగా ఉంటాయని తెలిసిందే. అయితే అదే విషయాన్నీ మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు విజయ్ దేవరకొండ. అయితే ఎలాంటి ఆదాయంలేని అవసరార్ధులే ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు విజయ్ దేవరకొండ టీం. 

మరింత సమాచారం తెలుసుకోండి: