టాలీవుడ్ లో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కి మంచి గుర్తింపు ఉన్న సంగతి తెలిసిందే. ఆయన సినిమాలు అనగానే అభిమానులకు ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. ప్రతీ సినిమా కూడా అభిమానులకు నచ్చుతూ ఉంటుంది. హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా ఆయన సినిమాలు చేయడం వాటిని కూడా అలాగే హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా అభిమానులు ఆదరించడం వంటివి మన౦ చూస్తూ ఉంటాం. ప్రస్తుతం ఆయన సినిమాలు ఎక్కువగా యువతకు బాగా నచ్చుతున్న సంగతి తెలిసిందే. అందుకే ఇప్పుడు ఆయన వ్యాపారాలను కూడా అదే విధంగా ఆలోచన చేస్తున్నారు. 

 

ఇప్పటికే రియల్ రంగం మీద మంచి లాభాలు ఆర్జించిన త్రివిక్రమ్ ఇప్పుడు మరికొన్ని రంగాల మీద దృష్టి పెడుతున్నారు. ఆయన చెప్పుల కంపెనీలకు సంబంధించి పెట్టుబడులు పెట్టే ఆలోచనలో ఉన్నారని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఆ రంగంలో పెట్టుబడులు పెట్టే దిశగా ఆయన అడుగులు వేస్తున్నారని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఆ రంగంలో మంచి లాభాలు ఉన్నాయని గ్రహించిన ఆయన ఇప్పుడు అక్కడ పెట్టుబడి పెట్టడానికి గానూ అనువైన సమయాన్ని వెతుక్కునే పనిలో ఉన్నారని అంటున్నారు. 

 

టాలీవుడ్ లో ఒక టాప్ హీరో తో కలిసి ఆయన ఈ పెట్టుబడులను పెట్టే ఆలోచనలో ఉన్నారట. ఇక యువతను ఆకట్టుకునే రంగాల మీద కూడా పెట్టుబడి పెట్టాలని ఆయన భావిస్తున్నారని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. మరి అది ఎంత వరకు ఫలిస్తుందో చూడాలి. ప్రస్తుతం ఆయన ఎన్టీఆర్ తో ఒక సినిమా చేస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ అనే సినిమాలో ఎన్టీఆర్ నటిస్తున్న సంగతి తెలిసిందే. దీనితో ఇప్పుడు ఈ సినిమా వాయిదా పడింది. అయితే ఎన్టీఆర్ రాకముందే కొన్ని సీన్స్ ని షూట్ చెయ్యాలని చూస్తున్నాడట.

మరింత సమాచారం తెలుసుకోండి: