టాలీవుడ్ లో ఒక వెలుగు వెలిగిన హీరోల్లో అక్కినేని నాగార్జున ఒకరు. వరుసగా ఒకప్పుడు సినిమాలు చేసి మంచి మంచి విజయాలు నమోదు చేసిన హీరో నాగార్జున. టాలీవుడ్ లో ఆయన ఆ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్నాడు. చిన్న చిన్న హీరోలు అందరూ కూడా ఆయనను అనుసరించే వారు అప్పట్లో అని అంటూ ఉంటారు. ఆ విధంగా ఆయన హీరోలకు అందరికి కూడా అప్పట్లో ఆదర్శంగా ఉండే వారు. ఇక ఇప్పుడు ఆయన వ్యాపారాల విషయానికి వస్తే టాలీవుడ్ లో ఏ హీరో కూడా ఇన్ని వ్యాపారాలను చేసిన పరిస్థితి లేదు అనే విషయం తెలిసిందే. 

 

దాదాపు ఆయన అన్ని వ్యాపారాల్లో ఉన్నారు అనే సంగతి అందరికి స్పష్టత ఉంది. ఇక ఇప్పుడు ఆయన మరికొన్ని కొత్త రంగాల్లోకి అడుగు పెట్టే ఆలోచనలో ఉన్నారట. వ్యాపారాలను మరింతగా విస్తరించే ఆలోచనలో ఉన్న ఆయన... డెల్ కంపెనీ లో పెట్టుబడులను పెట్టాలని యోచిస్తున్నట్టు సమాచారం. అక్కడ మంచి లాభాలు ఉండటం తో ఆయన పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఆ కంపెనీ ఉత్పత్తి చేసే చిన్న చిన్న పరికరాలకు సంబంది౦చి నాగార్జున పెట్టుబడులు ఉండే అవకాశం ఉందని అంటున్నారు ప్రస్తుతం ఆయన చర్చలు జరుపుతున్నారని అన్నీ అనుకున్నట్టు జరిగితే అందులో త్వరలోనే ఆయన పెట్టుబడులు ఉండే అవకాశం ఉందని సమాచారం. 

 

ఆయన ప్రతినిధులు ఇప్పటికే డెల్ ఆఫీస్ లో ప్రయత్నాలు కూడా మొదలుపెట్టారని అంటున్నారు. ఆంధ్రా తెలంగాణా, తమిళనాడు కర్ణాటక ప్రాంతాల్లో ఎక్కువగా పెట్టుబడులు పెడితే మంచి లాభాలు ఉంటాయని భావించి ఈ విధంగా కూడా ఆయన ఆలోచన చేస్తున్నట్టు సమాచారం.  మరి కొన్ని రంగాల మీద ఆయన దృష్టి పడింది అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. మరి ఏయే రంగాల మీద ఆయన పెట్టుబడులు పెడతారు ఇంకా అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: