సినిమాల్లో కష్టపడి సంపాదించిన డబ్బుని వృధా చేయకుండా స్టార్స్ అంతా తమ అభిరుచికి తగినట్టుగా బిజినెస్ లలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. వారిలో శర్వానంద్ కూడా ఒక కాఫీ హౌజ్ ను మొదలుపెట్టాడు. జూబ్లీ హిల్స్ క్లబ్ దగ్గర శర్వానంద్ బీన్జ్ కాఫీ హౌజ్ ను ప్రారంభించాడు. దీనికి ట్యాగ్ లైన్ ద అర్బన్ కాఫీ విలేజ్. ఇక్కడ రకరకాల కాఫీలు, వెరైటీ కాఫీలు దొరుకుతాయి. మాములుగా సినిమా తెరకెక్కించాలంటే కథ దగ్గర నుండి రిలీజ్ వరకు చాలా చర్చలు చేయాల్సిందే. అదేదో కాఫీ తాగుతూ చేస్తే ఆ కిక్ వేరేలా ఉంటుంది. శర్వానంద్ బీన్జ్ కాఫీ హౌజ్ బాగానే నడుస్తుందని తెలుస్తుంది. 

 

స్టార్స్ అంతా సినిమాల్లో సంపాదించిన సొమ్ముని వేరే బిజినెస్ లలో ఇన్వెస్ట్ చేయడం చాలా కామన్. యువ హీరో సందీప్ కిషన్ కూడా వివాహ భోజనంబు అంటూ ఒక రెస్టారెంట్ స్టార్ట్ చేశాడు. పెళ్లి భోజనం అంటే ఆ రుచి వేరేలా ఉంటుంది. అయితే ప్రతిరోజూ అదే రుచితో భోజనం పెట్టేస్తున్నాడు సందీప్ కిషన్. జూబిలీ హిట్ల్స్ రాడ్ నంబర్ 10లో సందీప్ కిషన్ రెస్టారెంట్ ఉంది. కొత్త రుచులతో వెరైటీ డిష్ లతో ఈ రెస్టారెంట్ బిజినెస్ లో సక్సెస్ అయ్యాడు సందీప్ కిషన్. సినిమాల్లో పెద్దగా సక్సెస్ రేటు లేకపోయినా బిజినెస్ లో మాత్రం సందీప్ కిషన్ సూపర్ గా క్లిక్ అయ్యాడని తెలుస్తుంది. 

 

వచ్చిన డబ్బుని దుబారా చేయకుండా చాలా పద్ధతిగా ఖర్చులు చేసుకుంటూ మిగిలిన మొత్తాన్ని ఇలా బిజినెస్ రూపంలో ఇన్వెస్ట్ చేయడం చాలా మంచి నిర్ణయమని చెప్పొచ్చు. వీరితో పాటుగా మిగతా యువ హీరోలు కూడా తమ అభిరుచికి తగిన బిజినెస్ లు చేస్తూ ఆవిధంగా కూడా డబ్బులు సంపాదిస్తున్నారు.         

మరింత సమాచారం తెలుసుకోండి: