లక్ష్మీ కళ్యాణం సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన కాజల్ అగర్వాల్... ఆ తర్వాత ఆర్య, ఆర్య 2 మిస్టర్.పర్ఫెక్ట్ లాంటి సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ సినిమాలలో నటించి చాలా క్రేజ్ ని సంపాదించుకుంది. అయితే ఆమె కేవలం మంచి నటి మాత్రమే కాదు తెలివైన వ్యాపారవేత్త కూడా. సోలో సినిమాలో నటించిన నిషా అగర్వాల్ కాజల్ సోదరి అని మనకు తెలుసు. నిషా అగర్వాల్ కొన్ని చిత్రాలలో నటించిన అనంతరం మ్యారేజ్ చేసుకుంది. దాంతో ఆమె సినిమాలకు పూర్తిగా దూరం అయ్యింది. ఆ సమయంలోనే కాజల్ అగర్వాల్ తన చెల్లెలితో కలిసి మార్సాల పేరుతో జ్యువలరీ షాప్ ని ప్రారంభించింది.


నిజానికి వ్యాపారం పెట్టడం ఒక ఎత్తైతే... దాన్ని విజయవంతంగా కొనసాగిస్తూ లాభాలు ఆర్జించడం మరో ఎత్తు. కాజల్ అగర్వాల్ ఒకవైపు సినిమాలు చేస్తూ తన బిజినెస్ లో పెట్టుబడులు పెడుతూ వస్తుంటే... తన చెల్లి నిషా మాత్రం షాప్ ని మేనేజ్ చేస్తోంది. దక్షిణ భారతదేశం మొత్తంలో బంగారపు దుకాణాలు పెట్టే ఆలచనలో కాజల్ అగర్వాల్ ఉందని తెలుస్తుంది. బిజినెస్ చేసేందుకు చేతులారా డబ్బులు ఉండాలి కాబట్టి ఇప్పటికీ ఆమె ఎన్నో సినిమాలలో నటిస్తూనే, షాప్ ఓపెనింగ్ కి వెళుతూనే ఫోటో షూట్స్ లలో పాల్గొంటుంది.


హీరోయిన్ కెరీర్ మహా అంటే పదిహేను ఇరవై సంవత్సరాల కంటే ఎక్కువ కాలం నిలవదు అనేది జగమెరిగిన సత్యం. అందుకే దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి అనే సూత్రాన్ని కాజల్ అగర్వాల్ బాగా పాటిస్తుంది. ముంబైలోని ఆమె జ్యువలరీ షాప్ లో మెడలో ధరించే ఆభరణాల నుండి చెవి దిద్దుల వరకు అన్నీ 24 క్యారెట్ బంగారు ఆధారాలు దొరుకుతాయి. షాపు ప్రారంభమైన మూడు సంవత్సరాల వరకు వారి బిజినెస్ కాస్త నెమ్మదిగా నడిచినా... ప్రస్తుతం మాత్రం బాగానే లాభాలను ఆర్జిస్తుందని తెలుస్తోంది. జ్యువలరీ షాప్ మినహాయించి  కాజల్ కి  ఒక షూ షాప్ కూడా ఉంది. నిర్మాతగా కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు కాజల్ అగర్వాల్ ప్రయత్నిస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: