మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ స్థాపించాడు అన్న విషయం విదితమే. పవన్ కళ్యాణ్ కంటే ముందుగా చిరు ఆగస్టు 28, 2008 వ తేదీన ప్రజారాజ్యం పార్టీని స్థాపించాడు. ఐతే ప్రజారాజ్యం పార్టీకి యువ అధినేతగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు వహించే వాడు. 2009వ సంవత్సర సార్వత్రిక ఎన్నికలలో ప్రజారాజ్యం పార్టీ కేవలం 18 సీట్లు మాత్రమే సాధించగలిగింది. దాంతో తీవ్ర మనస్తాపానికి గురైన చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు.


ఆ తర్వాత ప్రజారాజ్యం యువనేత పవన్ కళ్యాణ్ సొంతంగా జనసేన పార్టీని స్థాపించాడు. మరోవైపు చిరంజీవి మన్మోహన్ సింగ్ క్యాబినెట్ లో స్వతంత్ర హోదా గల పర్యాటక మంత్రిగా బాధ్యతలు చేపట్టాడు. ప్రస్తుత విషయానికి వస్తే మెగాస్టార్ రాజకీయాలకు స్వస్తి చెప్పి మళ్ళీ సినీ రంగానికే తన పూర్తి సమయాన్ని కేటాయిస్తున్నాడు. ఆచార్య సినిమాలో చిరు నటిస్తుండగా... పవన్ పింక్ రీమేక్ వకీల్ సాబ్, విరూపాక్ష చిత్రాలలో నటిస్తున్నాడు.


ఇప్పుడు మన ఇండియాలో లాక్ డౌన్ అమలవుతుండగా సినీ చిత్రీకరణలు మొత్తం నిలిపివేయబడినవి. దాంతో సెలబ్రిటీలు ఇంటికే పరిమితమయ్యారు. చిరంజీవి కూడా ఇంట్లోనే ఉంటూ ఇంటి పనులు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఆయన ఓ ఆన్లైన్ ఇంటర్వ్యూలో మాట్లాడాడు. ఆ ఇంటర్వ్యూ లో తన తమ్ముడు పార్టీ గురించి మాట్లాడటం విశేషం. ఆయన మాట్లాడుతూ... 'పవన్ నాతో కలిసి రాజకీయ ప్రయాణం చేశాడు. ఆ సమయంలో నేను నమ్మిన వాళ్లు, చేరదీసిన వాళ్లే నన్ను మోసం చేయడం కళ్ళారా చూసి తట్టుకోలేక పోయాడు. ఆ చేదు అనుభవాల నుండే జనసేన పార్టీ స్థాపించి ప్రజల్లోకి తాను అనుకున్నట్టుగా దూసుకెళ్తున్నాడు. మా దారులు మొత్తం వేరయినా మా గమ్యం మాత్రం ఒక్కటే. తన దారిలోకి వెళ్లి నేను ఎటువంటి సలహాలు ఇవ్వను. తాను ఫ్రీ గా ఉన్నప్పుడు ఇంటికి వస్తూనే ఉంటాడు. అమ్మను కలుస్తాడు. అందరితో కలిసి పోతాడు. మాతో కలిసి భోజనం కూడా చేస్తాడు. ఇక మేమిద్దరమే కలిసినప్పుడు మాత్రం రాజకీయ విషయాలు తప్ప అన్ని విషయాలను మాట్లాడుకుంటాం. ముఖ్యంగా మా కుటుంబం గురించి ఎక్కువ గా మాట్లాడుకుంటాం', అని చిరంజీవి చెప్పుకొచ్చాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: