సెలబ్రిటీలు గ్లామర్‌ ఫీల్డ్ లో ఉండగానే దానికి అనుబంధంగా ఉన్న రంగాల్లో బిజినెస్‌ లు స్టార్ట్ లు చేస్తుంటారు. అయితే మరికొందరు మాత్రం తమ రంగానికి ఏ మాత్రం సంబంధం లేని రంగాల్లోకి అడుగుపెడుతుంటారు. అయితే అందుకు చాలా కారణాలే ఉన్నాయి. తమ గ్లామర్‌ బిజినెస్‌ కు ప్లస్ అవుతుందన్న నమ్మకంతో శృంగార పరమైన వ్యాపారాల మీద దృష్టిపెడుతున్నారు.

 

అదే బాటలో హాలీవుడ్‌ టాప్‌ పాప్‌ సింగర్‌ లేడీ గగా కూడా ఓ విభిన్న రంగంలో వ్యాపారం ప్రారంభించింది. ఈ భామ కండోమ్స్‌ తయారు చేస్తే సంస్థలో పార్టనర్ ‌గా చేరింది. అంతేకాదు అందులోనూ తన మార్క్ కనపించేలా విభిన్నంగా గ్రీన్‌, పింక్‌ రంగుల్లో కండోమ్స్‌ ను ఉత్పత్తి చేసింది.

 

అయితే లేడీ గాగ సంస్థ నుంచి వచ్చిన ఈ కండోమ్స్ పై భిన్నాబిప్రాయాలు వినిపించాయి. కానీ గగా మాత్రం ఇది కూడా ఓ ఫ్యాషన్‌ స్టేట్‌మెంట్ అంటూ తాను ఉత్పత్తి చేసిన కండోమ్స్‌ను సమర్థించింది.

 

అమెరికన్‌ నటిగా, గాయనిగా పేరు తెచ్చుకున్న కేశా కూడా కండోమ్‌ వ్యాపారంలో ఉంది. 2010లో లాంచ్‌ చేసిన ఈ కండోమ్స్ ప్రచారంలో భాగంగా వాటిని తన ముఖం మీద పెట్టుకొని తీయించుకున్న ఫోటో షూట్‌తో తన ప్రాడక్ట్స్ ను లాంచ్‌ చేసింది.

 

మరో అమెరికన్‌ టీవీ పర్సనాలిటీ గారీ షెర్లీ కూడా కండమ్‌ తయారీ సంస్థ ను నిర్వహిస్తున్నాడు. కొంత మంది సంస్థలను నిర్వహిస్తుంటే మరికొందరు పలు ప్రసిద్ధ సంస్థలకు ప్రచార కర్తలుగా వ్యవహరిస్తున్నారు.  బాలీవుడ్ హీరో రణవీర్‌ సింగ్‌తో పాటు శృంగార తార సన్నీలియోన్లు కూడా ఇలా కండోమ్‌ యాడ్స్‌లో నటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: