మామూలుగానే సినిమాల్లో నటించే హీరో హీరోయిన్లు కాస్త క్రేజ్ పెరిగింది కొంచెం డబ్బులు ఎక్కువగా వచ్చాయి అంటే చాలు సైడ్ బిజినెస్  లు  ప్రారంభిస్తూ ఉంటారు  అన్న  విషయం తెలిసిందే. మరి అలాంటిది అంతకు మించి సంపాదించే నిర్మాతలు సైడ్ బిజినెస్ పెట్టుకోకుండా ఉంటారా.... రెండు చేతులా సంపాదించుకుండా  ఉంటారా.. అందుకే చాలా మంది నిర్మాతలు ఎన్నో సైడ్ బిజినెస్ లు  మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఓ వైపు సినిమాలు నిర్మిస్తూనే మరోవైపు బిజినెస్ లో కూడా సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతు ఉంటారు. లేదా కొన్ని బిజినెస్ లలో  పెట్టుబడులు పెడుతూ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. 

 

 

 ఇలా టాలీవుడ్లో చాలా మంది తమ తమ అదృష్టాన్ని పరీక్షించుకునే సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. ఓవైపు బిజినెస్లో మరోవైపు సినిమాల నిర్మాణం లో సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతున్న నిర్మాత దిల్ రాజు. దిల్ రాజు టాలీవుడ్ లో స్టార్ నిర్మాతగా దూసుకుపోతున్నారు అనే విషయం తెలిసిందే. ఈయన భారీ బడ్జెట్ సినిమాలను నిర్మించడంతో పాటు మంచి కథ ఉంటే చిన్న సినిమాలను కూడా నిర్మించడానికి ముందుకు వస్తూ ఆదర్శంగా నిలుస్తూ ఉంటారు. ఇక దిల్ రాజుకు చాలానే సైడ్ బిజినెస్ లు ఉన్నాయి అనే విషయం తెలిసిందే. 

 

 

 ముఖ్యంగా దిల్ రాజు ఎన్నో సినిమా థియేటర్లను నడుపుతూ ఉంటాడు. థియేటర్లు నడిపే బిజినెస్ లో  దిల్ రాజు  సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతున్నాడు . తెలుగు రాష్ట్రాల్లో దిల్ రాజు కు  ఎన్నో  థియేటర్లు ఉన్నాయి అని చెప్పాలి. ఇక అటు థియేటర్ల విషయంలో కూడా తన హవా నడుపిస్తూ ఉంటాడు దిల్ రాజు . అంతే కాకుండా రియల్ ఎస్టేట్ లో కూడా దిల్ రాజుకు మంచి పట్టు ఉంది అంటూ ఉంటారు. చాలా మటుకు దిల్ రాజు రియల్ ఎస్టేట్ లో కూడా భారీగానే పెట్టుబడులు పెడుతూ ఉంటారు అన్న టాక్ కూడా ఉంది. ఇలా ఓ వైపు సినిమాలు నిర్మిస్తూ మరోవైపు సినిమా థియేటర్లను మెయింటైన్ చేస్తూ ఇంకోవైపు రియల్ ఎస్టేట్ లో కూడా హవా నడిపిస్తున్నారు టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు.

మరింత సమాచారం తెలుసుకోండి: