తమిళ స్టార్ హీరో సూర్య సినిమాలను బ్యాన్ చేస్తామని థియేటర్ ఓనర్స్ తెలిపారు.  కరోనా వైరస్ కారణంగా సినిమా థియేటర్లు, మాల్స్, స్కూల్స్, ప్రైవేట్ సంస్థలు బంద్ అయిన సంగతి తెల్సిందే. దీంతో విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాలను నేరుగా అమెజాన్ ప్రైమ్, హాట్ స్టార్, నెట్ ఫ్లిక్స్ వంటి ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ లలో రిలీజ్ చేయాలని కొందరు దర్శక నిర్మాతలు ఆలోచిస్తున్నారు.  జ్యోతిక ప్రధాన పాత్రలో ఆమె భర్త, సూర్య నిర్మించిన మూవీ ‘పొన్మగల్ వంధాల్’.  ఈ సినిమాను డైరెక్ట్‌గా అమేజాన్ ప్రైమ్‌లో విడుదల చేయాలని సూర్య నిర్ణయించుకున్నారు. అయితే ఈ నిర్ణయంపై తమిళనాడు థియేటర్స్ యాజమాన్య సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది.  

 

మరోవైపు కొత్తగా రూపొందిన సినిమాలకు అమేజాన్ ప్రైమ్, నెటిఫ్లిక్స్ వంటి ఓటీటీల నుంచి భారీ ఆఫర్లు వస్తున్నాయి. దాంతో కొంతమంది తమ బెనిఫిట్ చూసుకొని రిలీజ్ కి సిద్దమవుతున్నారు. కాగా,  ఈ నిర్ణయంపై తమిళనాడు థియేటర్స్ యాజమాన్య సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. సూర్యను హెచ్చరిస్తూ తమిళనాడు థియేటర్స్ యాజమాన్య సంఘం ప్రధాన కార్యదర్శి పన్నీర్ సెల్వం ఓ వీడియోను విడుదల చేశారు. ‘సినిమాలను పూర్తిగా థియేటర్లను దృష్టిలో ఉంచుకునే తెరకెక్కిస్తారు. సూర్య నిర్మించిన చిత్రం డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదల కావడాన్ని మేం వ్యతిరేకిస్తున్నాం.

 

ఓటీటీలో విడుదల చేయాలనే నిర్ణయాన్ని సూర్య వెనక్కి తీసుకోవాలని  లేకపోతే సూర్య నటించిన, నిర్మించిన సినిమాలపై నిషేధం విధిస్తామని హెచ్చరించిన విషయం తెసిందే. అయితే ఈ విషయంపై క‌రోనా ప్ర‌భావంతో చిన్న నిర్మాత‌లు తీవ్ర ఇబ్బంద‌లు ఎదుర్కొంటున్నారు. చిన్న చిత్రాల‌ను ఆన్‌లైన్ విడుద‌ల చేయ‌డానికి డిజిట‌ల్ సంస్థ‌లు ముందుకు రావ‌డం మంచి ప‌రిణామం. చిన్న నిర్మాత‌ల‌కు మంచి అవ‌కాశం. ఈ విష‌య‌మై డిస్ట్రిబ్యూట‌ర్స్‌తో చ‌ర్చ‌లు చేస్తా అని నిర్మాత టి.శివ అంటున్నారు. సూర్యకు మద్దతు రావడం మంచి పరిణామం అంటున్నారు మరికొంత మంది చిన్న నిర్మాతలు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: