ఇండియన్‌ స్క్రీన్‌ మీద తిరుగులేని టాప్ స్టార్ అమితాబ్ బచ్చన్‌. దశాబ్దాలుగా ఇండియన్ స్క్రీన్‌ను ఏళుతున్న బిగ్ బీ నటుడిగా ఎన్నో అత్యున్నత శిఖరాలను అందుకున్నాడు. నటుడిగా ఆయన చేయని ప్రయోగం లేదు. ఆయన పోషించని పాత్ర లేదు. అందుకే నటుడిగా మారాలనుకుంటున్న చాలా మందికి ఆయన ఓ ఇన్సిపిరేషన్‌, గో గైడ్‌. అయితే ఇన్ని విజయాలు సాధించిన ఈ అమితాబ్ బిజినెస్‌ మెన్‌గా మాత్రం ఫెయిల్‌ అయ్యాడు.

 

అమితాబ్ హీరోగా టాప్ పోజిషన్‌లో ఉన్న సమయంలో తన పేరు మీదే ఓ నిర్మాణ సంస్థను ప్రారంభిచాడు. ఏబీసీఎల్ పేరుతో బ్యానర్‌ను స్థాపించిన బిగ్ బీ ఆ బ్యానర్‌లో సినిమాలను టీవీ షోస్‌ను నిర్మించాడు. అయితే నటుడిగా ఎంతటి విజయాలు సాధించాడో.. నిర్మాతగా అంతే దారుణంగా విఫలమయ్యాడు బిగ్ బీ. తన సొంత బ్యానర్‌లో అమితాబ్ తెరకెక్కించిన సినిమాలన్నీ డిజాస్టర్ అయ్యాయి. దీంతో ఆర్థికంగా బిగ్‌ బీ చాలా నష్టపోయాడు.

 

దశబ్దాలు పాటు నటుడిగా ఆయన సంపాదించిన సొమ్మంతా నిర్మాతగా పొగొట్టుకున్నాడు. ఒక దశలో అమితాబ్‌ పని అయిపోయిందని అంతా భావించారు. చేతిలో చిల్లిగవ్వ లేక తన ఇళ్లు జల్సాను కూడా అమ్ముకోవాలనుకున్నాడు. కానీ అదే సమయంలో తిరిగి నటుడిగా పుంజుకున్నాడు అమితాబ్. వరుస అవకాశాలతో టాప్ స్టార్‌గా ఎదిగాడు.

 

వ్యాపారాల్లో ఫెయిల్ కావటంతో తిరిగి వ్యాపార రంగంలోకి అడుగుపెట్టలేదు అమితాబ్. అయితే అమితాబ్‌కు బదులు ఆయన కుమారుడు అభిషేక్‌ పూర్తిస్థాయి వ్యాపార వేత్తగా ఎదుగుతున్నాడు. పలు స్పోర్ట్స్ టీంలను సొంతం చేసుకున్న అభిషేక్‌ భారీగా సంపాదిస్తున్నాడు. అయితే అమితాబ్ బిజినెస్‌ మెన్‌గా ఫెయిల్ అయితే అభిషేక్‌ నటుడిగా ఫెయిల్ అయ్యాడు. హీరోగా ఎంట్రీ ఇచ్చిన తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకోలేకపోయాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: