టాలీవుడ్ కింగ్ మ‌న్మ‌ధుడు అర‌వై ఏళ్ళ వ‌య‌సులో కూడా  యువ సామ్రాట్‌గా ఎదిగి తండ్రి నుండి పొందిన పేరును  వ‌దిలేసి త‌న‌కంటూ సొంత క్రేజ్‌ని సొంత అభిమానాన్ని ఏర్ప‌ర్చుకుని యువ హీరోల‌కి సైతం గ‌ట్టి పోటీనిస్తున్నాడు.  హీరోగా..బిజినెస్‌మ్యాన్‌గా ముందుకు దూసుకుపోతున్న న‌వ మ‌న్మ‌ధుడు నాగార్జున ఈ రోజు హెరాల్డ్ విజేత‌.  1959 ఆగ‌స్టు 29 అక్కినేని నాగేశ్వ‌ర‌రావు అన్న‌పూర్ణకు జ‌న్మించాడు నాగార్జున‌. నాగార్జున‌కి ఒక అన్న‌య్య‌, ముగ్గురు అక్క‌లు ఉన్నారు. నాగార్జున చిన్న‌ప్పుడే అనుకోకుండా న‌టించాల్సి వ‌చ్చింది. మ‌ద్రాస్‌లో మెకానిక‌ల్ ఇంజ‌నీరింగ్ చేశారు.  నాగార్జున హీరోగా హిందీ మూవీ రీమేక్ చేసిన విక్ర‌మ్‌లో న‌టించారు. ఆ సంవ‌త్స‌రంలోనే నాగార్జున‌కు నాగ‌చైత‌న్య పుట్టారు. ఆ స‌మ‌యంలోనే కెప్టెన్ నాగార్జున కూడా విడుద‌లైంది. కానీ రెండు సినిమాలు నాగార్జున‌కి నిరాశ‌నే మిగిల్చినా కొడుకు పుట్టిన ఆనందంలో అవ‌న్నీ మ‌ర్చిపోయాడు.

 

దాస‌రినారాయ‌ణ‌రావు ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన మ‌జ్ను చిత్రం హిట్ అయింది. ఆ త‌ర్వాత వ‌చ్చిన సంకీర్త‌న తండ్రితో క‌లిసి న‌టించిన క‌లెక్ట‌ర్‌గారి అబ్బాయి, అగ్నిపుత్రుడు, కిరాయిదాదా ఇవేమి కూడా నాగార్జున‌కు పెద్ద‌గా సంతృప్తిని ఇవ్వ‌లేదు. రాఘ‌వేంద్ర‌రావు ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఆఖ‌రి పోరాటం మంచి హిట్ అయింది. అయితే ఆ చిత్రం ఆయ‌న కెరియ‌ర్‌లో హిట్ అయింది కానీ ఇండ‌స్ట్రీ హిట్ కాలేదు.  అప్ప‌టికే చిరంజీవి ఖైదీ చిత్రంతో బాల‌కృష్ణ మంగ‌మ్మ‌గారి మ‌న‌వ‌డుతో మంచి హిట్లు కొట్టారు. మ‌ణిర‌త్నం ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన గీతాంజ‌లి చిత్రంతో సెంటిమెంట్‌ని పండించే మంచి హీరోగా హిట్ కొట్టారు. ఈ సినిమా పాట‌లు ఇప్ప‌టికీ ట్రెండింగ్‌లో ఉన్నాయి. 

 


త‌ర్వాత రామ్‌గోపాల్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో శివలో న‌టించాడు. విజ‌య‌వాడ బ్యాక్‌గ్రౌండ్‌లో 1920లో వ‌చ్చిన ఈ సినిమా ఒక ట్రెండ్ సెట్ట‌ర్ అయింద‌ని చెప్పాలి. ప్రెసిడెంట్‌గారి పెళ్ళా, అ్ల‌ల‌రి అల్లుడు, ఇవ‌న్నీకూడా మాస్‌హీరోగా నిల‌బెట్టారు. కృష్ణ‌వంశీ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన నిన్నే పెళ్ళాడ‌తా చిత్రం కూడా సూప‌ర్ హిట్ అయింది. నాగార్జున సినిమాలు మాత్ర‌మే కాక టెలివిజ‌న్‌లో  మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుడు ప్రోగ్రామ్‌కి హోస్ట్‌గా చేశారు. అంతేకాక మ‌రింకెన్నో సైడ్ బిజినెస్‌ల‌లో కూడా త‌న ఇన్‌వెస్ట్‌మెంట్ల‌ను పెట్టి అటు వ్యాపార రంగంలో కూడా ముందుకు దూసుకుపోయాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: