పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమాతో సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్నాడు. బాలీవుడ్ లో విజయం సాధించిన పింక్ సినిమాని వకీల్ సాబ్ పేరుతో రీమేక్ చేస్తున్నారు. దిల్ రాజు నిర్మాతగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి. అయితే ఈ సినిమా అనంతరం పవన్ కళ్యాణ్ మరో రెండు సినిమాలని ఒప్పుకున్నాడు. వకీల్ సాబ్ సెట్స్ మీద ఉండగానే క్రిష దర్శకత్వంలో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.

 

 

గమ్యం, కంచె, వేదం వంటి రియలిస్టిక్ చిత్రాల దర్శకుడు క్రిష్ రూపొందిస్తున్న ఈ సినిమా పవన్ కళ్యాణ్ కెరీర్లోనే భారీ బడ్జెట్ సినిమాగా తెరకెక్కుతోంది. పీరియాడిక్ డ్రామాగా రూపొందుతున్న పవన్ కళ్యాణ్ మొదటి చిత్రం ఇది. మొఘలుల కాలం నాటి కథలో పవన్ కళ్యాణ్ బందిపోటుగా కనిపించనున్నాడట. కోహినూర్ వజ్రం గురించిన కథతో వస్తున్న ఈ సినిమా మీద చాలా అంచనాలు ఏర్పడ్డాయి.

 

 

పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న మొదటి పవన్ కళ్యాణ్ చిత్రం ఇదే. బాహుబలి తర్వాత టాలీవుడ్ హీరోలందరూ పాన్ ఇండియా బాట పడుతున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్, రామ్ చరణ్, బన్నీ పాన్ ఇండియా సినిమలతో బిజీగా ఉన్నారు. అయితే పాన్ ఇండియా రేంజ్ లో సినిమా అంటే ఇతర భాషల నటీనటులు ఉండాల్సిందే. ఇతర భాషల్లో సినిమాకి పాపులారిటీ రావాలంటే అక్కడి నటులు ఉంటే చాలా మేలు జరుగుతుంది.

 

 

అందుకే పవన్ కళ్యాణ్ క్రిష్ సినిమా కోసం తమిళ నటుడిని తీసుకోనున్నారట. శివకార్తికేయన్ ని  ఈ సినిమాలో నటించడానికి సన్నాహాలు చేస్తున్నారట. శివ కార్తికేయన్ తమిళంలో పాపులర్ హీరో. అందువల్ల అక్కడ మార్కెట్ క్రియేట్ చేయడానికే శివ కార్తికేయన్ ని తీసుకోనున్నారని అంటున్నారు. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: