ఈ మద్య సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి సెలబ్రెటీలు ఏ చిన్న పొరపాటు చేసినా అది కాస్త రచ్చ రచ్చ అవుతుంది.  పరిస్థితి సీరియస్ అవ్వడంతో సారీ సెలబ్రెటీలు సారీ చెప్పడం జరుగుతుంది.  తాజాగా మాలీవుడ్ లో సూపర్ స్టార్ మమ్ముట్టి తనయుడు దుల్కర్ సల్మాన్ హీరోగా వెండి తెరకు పరిచయం అయ్యాడు. ఆ మద్య నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కీర్తి సురేష్ నటించిన ‘మహానటి’ చిత్రంలో హీరోగా నటించాడు.  తాజాగా   దుల్కర్‌ సల్మాన్‌ నటించిన 'వారణే అవశ్యముండే' అనే చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల చేశారు. ఈ  చిత్రంలో ఓ సీన్‌ ఎల్‌టీటీఈ చీఫ్‌ ప్రభాకరన్‌ను అవమానించేలా ఉందని విమర్శలు వచ్చాయి. 

 

ఎల్‌టీటీఈ చీఫ్‌ ప్రభాకరన్ అంటే తమిళులకు ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.  ఆయనపై అనుచితంగా ఉన్న సీన్ ఉందని తమిళుల మనోభావాలను దెబ్బతీశారని సామాజిక మాధ్యమాల్లో తమిళులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ క్షమాణలు చెప్పాలని డిమాండ్ చేశారు.  వెంటనే దీనిపై దుల్కర్ సల్మాన్ స్పందిస్తూ క్షమాపణలు చెప్పాడు. తన తరఫున, ఆ సినిమా యూనిట్‌ తరఫున క్షమాపణలు చెబుతున్నట్లు ట్విట్టర్‌లో ఎమోషనల్ గా ఓ పోస్ట్ పెట్టాడు.

 

'వారణే అవశ్యముండే' చిత్రంలో ప్రభాకరన్‌ జోక్‌ తమిళ ప్రజలను అవమానించేలా ఉందని చాలా మంది వ్యాఖ్యానించారని, అయితే, ఇది ఉద్దేశపూర్వకంగా చేసింది కాదని, గతంలో వచ్చిన మలయాళ చిత్రం 'పట్టణ ప్రవేశం' లో, ఓ సీన్‌లోని జోక్‌‌ స్ఫూర్తితో ఆ సన్నివేశాన్ని రూపొందించామని అన్నాడు.  అయితే ఆ సీన్ కేరళాలో బాగా మీమ్స్ అవుతుండటంతో తాము తీసుకున్నామని వేరే ఉద్దేశం అస్సలే లేదని ఆయన తెలియజేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను కూడా పోస్ట్ చేశాడు. కొందరు చిత్రం చూడకుండానే విమర్శలు చేస్తున్నారని ఆయన అన్నాడు. ఒకవేళ ఈ సన్నివేశం వల్ల బాధపడితే తమిళ ప్రజలకు తాను క్షమాపణలు చెబుతున్నానని అన్నాడు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: