లాక్ డౌన్ టైమ్ లో గతాన్ని తవ్వుకుంటున్నారు తారలు. చిన్నప్పుడు నేను ఇలా ఉండే వాళ్ళం.. అలా చేసే వాళ్లం అంటూ.. తమ మనసులోని మాటలను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. స్టార్ హీరోయిన్ కియారా అద్వాని తన చిన్ననాటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. తాను చిన్నప్పుడు పాలు తాగుతున్న వీడియో పెట్టి.. పాలకు పాలు నీళ్లకు నీళ్లు అంటూ కామెంట్ రాసింది కియార. ప్రస్థుతం బాలీవుడ్ లో నాలుగు సినిమాలతో మంచి జోష్ లో ఉంది. టాలీవుడ్ లో రెండు సినిమాలు చేసిందీ భామ.

 

సాహో భామ శ్రద్దా కపూర్ కూడా తన చిన్ననాటి తీపి గురుతులను అభిమానులతో పంచుకుంది. చిన్నప్పటి పోటో ఒకటి సోషల్ మీడియాలో షేర్ చేసి... కుందేలు లాంటి పళ్లు ఉన్నప్పటి పోటో ఇది అని సరదాగా కామెంట్  రాసింది. ఈ పోటోకి సారా అలీ ఖాన్ స్పందిస్తూ.. సో క్యూట్ అంటూ కామెంట్ పెట్టింది.

 

ఇక ఆ మధ్య మెగా హీరో  వరుణ్ తేజ్ కూడా  తన అన్న రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా తనను  మెగా పవర్ స్టార్ ఎత్తుకున్న చిన్ననాటి పోటోను సోషల్ మీడియాలో  అభిమానులతో పంచుకున్నాడు.. అంతే కాదు ఆ మధ్య అక్కినేని వారి కొడలు సమంత చిన్ననాటి ఫోటో కూడా సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది.

 

రీసెంట్ డేస్ లో సోషల్ మీడియాలోకి కొత్తగా వచ్చిన  టాలీవుడ్  మెగాస్టార్ చిరంజీవి కూడా ఓ సందర్భంలో తన చిన్ననాటి జ్ఞాపకాలు అభిమానులతో పంచుకున్నారు. చిన్నప్పటి పోటో ఒకటి సోషల్ మీడియాలో పెట్టి.. ఈ ఫోట్ లో నేను చిన్నప్పుడు నాకు లాటరీలో వచ్చిన ఆంజనేయుడి లా ఉన్నానని మా నాన్నగారు అంటూ చిన్ననాటి గ్నాపకాల్ని గుర్తు చేసుకున్నారు చిరంజీవి.

మరింత సమాచారం తెలుసుకోండి: