లాక్ డౌన్ వల్ల ముప్పు ఏంటి అన్నది అందరికీ అర్ధమవుతూనే ఉంది. చిరుద్యోగుల నుంచి అందరూ కోతకు, గుండె కోతకు గురి అవుతున్నారు. చేయని తప్పుకు శిక్ష అనుభవిస్తున్నారు. నిజమే ఇది ప్రక్రుతి చేసిన పాపం, ప్రక్రుతి పెట్టిన శాపం. దాంతో మొత్తం మానవ జాతి అంతా అనుభవిస్తోంది.

 

ఇందులో ఎక్కువ తక్కువలు లేవు. కోట్లు ఉన్నవాడు అక్కడికి మునిగిపోతున్నాడు. ఇక టాలీవుడ్లో తీసుకుంటే భారీ ప్రాజెక్టులకు లాక్ డౌన్ గండం బాగా వచ్చిపడింది. మధ్యలో షూటింగులు ఆగిపోవడంతో దివాలా తీసేలా నిర్మాతలు తయారయ్యారు. వడ్డీలకు తెచ్చిన పెట్టుబడులు ఇపుడు రీళ్ళలో, కన్నీళ్ళలో పడి ఖ‌ర్చు అయిపోతున్నాయి. దాంతో ఏం చేయాలో దిక్కుతోచడంలేదు. సినిమాలు పూర్తి చేయడం ఒక ఎత్తు. పూర్తి అయిన వాటిని ధియేటర్లలోకి తీసుకెళ్ళడం మరో ఎత్తు.

 

ఈ నేపధ్యంలో చూసుకుంటే పెద్ద సినిమాల్లో ఒకటిగా ఉన్న ఆర్.ఆర్.ఆర్ వంటి భారీ, క్రేజీ ప్రాజెక్ట్ కి భారీ షాక్ తగులుతోందిట. ఈ మూవీ వర్క్ ఇంకా చాలా ఉంది. పైగా అసలైన వర్కే నిలిచిపోయిందిట. అందంతా కంప్లీట్ చేసుకుని మూవీని రిలీజ్ వరకూ నడిపించడం అంటే ఇపుడున్న పరిస్థితుల్లో కష్టమనే అంటున్నారు. ఇక ఇప్పటికే భారీగా పెట్టేసిన పెట్టుబడి ఓ వైపు ఉంటే షూటింగ్ ఆగిపోవడంతో మిగిలిన టైం వేస్ట్. దానికి తోడు అదనంగా భారం పడుతోంది.

 

ఈ నేపధ్యం నుంచి చూసుకున్నపుడు లాక్ డౌన్ అనతరం భారీ క్రేజీ ప్రాజెక్టులు ఎంతవరకూ వర్కౌట్ అవుతాయన్నది కూడా పెద్ద డౌట్ గా ఉంది. ఇవన్నీ పరిగణనలోకి తీసుకున్న ఆర్.ఆర్.ఆర్ టీం టెన్షన్లో ఉందని టాక్. వచ్చే ఏడాది సమ్మర్ కి అయినా పరిస్థితులు సర్దుబాటు అయితేనే ఆర్.ఆర్.ఆర్ కి కాస్త ఊపిరి వస్తుందని అంటున్నారు. ఇక ఈ మూవీ ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయినా లభాలు అనుకున్నవి వతాయా అన్నది కూడా ఒక టెన్షన్ గా ఉందిట. చూడాలి మరి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: