టాలీవుడ్ ట్రెండ్ సెట్టర్ సినిమాలు చాలా ఉన్నాయి. వాటి గురించి చెప్పుకోవాల్సి వస్తే అప్పట్లో రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన 'శివ' ఒక ట్రెండ్ సెట్టర్ సినిమా. 'శివ' సినిమా తర్వాత తెలుగు సినిమాల్లో చాలా మార్పులు రావడం జరిగాయి. టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర అనేక రికార్డు కలెక్షన్లు సాధించింది. అటువంటి ట్రెండ్ సెట్ చేసే సినిమాని రాంగోపాల్ వర్మ శిష్యుడు పూరి జగన్నాథ్ తీశాడు. ఆ సినిమాయే పోకిరి. మహేష్ బాబు కెరీర్లో మాత్రమే కాకుండా 75 ఏళ్ల తెలుగు సినిమా రికార్డులను బద్దలు కొట్టింది పోకిరి.

 

మహేష్ బాబుకి సూపర్ స్టార్ అనే స్టార్ డమ్ తీసుకొచ్చింది. టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర తిరుగులేని సునామీ కలెక్షన్లు సాధించింది పోకిరి. సినిమా అంతా బ్లాక్ బస్టర్ హిట్ అవడానికి గల కారణాలు చూస్తే పూరి టేకింగ్ తో పాటు మహేష్ బాబు ఎన్నడూ చేయని మాస్ పెర్ఫార్మన్స్, డైలాగులు మరియు మణిశర్మ అందించిన మ్యూజిక్ ఇలా అని విధాలా ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. ముఖ్యంగా ఎవరూ ఊహించని విధంగా క్లైమాక్స్ సన్నివేశం సినిమాకి పెద్ద టర్నింగ్ పాయింట్ అని చెప్పవచ్చు.

 

2006 వ సంవత్సరం ఏప్రిల్ 28 వ తారీఖున రిలీజ్ అయిన ఈ సినిమా నేటికీ 14 సంవత్సరాలు అయింది. ముఖ్యంగా సినిమాలో హీరోయిన్ ఇలియానా పెర్ఫార్మెన్స్ కూడా అదరగొట్టింది అని చెప్పవచ్చు. గల గల పారుతున్న గోదారిలా, ఇప్పటికింకా నా వయసు 16 పాటలు అప్పట్లో ఒక ఊపు ఊపాయి. కామెడీ పరంగా కూడా బ్రహ్మానందం మరియు ఆలీ మధ్య ఎపిసోడ్ కూడా ప్రేక్షకులను అప్పట్లో కడుపుబ్బా నవ్వించే విధంగా తీశాడు. ‘ఎవడు కొడితే మైండ్ దిమ్మతిరిగి బ్లాక్ అయిపోధో వాడే పండు గాడు’ అని మహేష్ బాబు చెప్పిన డైలాగ్… మహేష్ కెరియర్ లోనే ఆల్ టైం బ్లాక్ బస్టర్ డైలాగ్ అని చెప్పవచ్చు. అటువంటి ‘పోకిరి’ సినిమా 75 ఏళ్ళ తెలుగు సినిమా చరిత్రని తిరగరాస్తూ క్రియేట్ చేసిన ఆల్ టైం రికార్డ్స్..

 

50 డేస్ – 300 సెంటర్స్

100 డేస్ – 200 సెంటర్స్

175 డేస్ – 63 సెంటర్స్

200 డేస్ – 15 సెంటర్స్

300 డేస్ – 2 సెంటర్స్

మరింత సమాచారం తెలుసుకోండి: