మెగా ఫ్యామిలీ తర్వాత హీరోగా వచ్చిన పవన్ కళ్యాణ్ యూత్ ఫాలోయింగ్ తో పవర్ స్టార్ గా మారాడు. మొదటి రెండు సినిమాలు పెద్దగా ఆడకపోయినా మూడవ సినిమా నుండి పవన్ రేంజ్ ఏంటో చూపించాడు. ఇక అప్పటికే తొలిప్రేమ, తమ్ముడు సినిమాల హిట్ తో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న పవన్ కళ్యాణ్ ఇక ఆ తర్వాత వచ్చిన బద్రితో దుమ్ముదులిపేశాడు. పూరి జగన్నాథ్ మొదటి సినిమాగా వచ్చిన బద్రి సూపర్ హిట్ అయ్యింది. పూరిలోని పొగరు మొదటి సినిమా నుండి చూపించాడు. 

 

అందరు దర్శకులు హీరో పాత్రలను ఒకళా రాసుకుంటే పూరి జగన్నాథ్ మాత్రం మరోలా రాసుకుంటాడు. పూరి సినిమాలతోనే హీరోల ఇమేజ్ మారిన సందర్భాలు ఉన్నాయి. బద్రి సినిమాలో బద్రినాథ్ పాత్రలో పవన్ కళ్యాణ్ చూపించిన పొగరు అంతా ఇంతా కాదు.. హీరో పాత్రని అందరు దర్శకులు చూపిస్తే. పూరి మాత్రం క్రేజీగా చూపిస్తాడు. అంతేకాదు పూరి సినిమాలో హీరోలు ఎప్పుడు విలన్ కు ధీటుగా ఉంటారు. విలన్ ను ఢీ కొట్టాలంటే పూరి హీరోలా ఉండాలనేలా హీరో పాత్రని రాసుకుంటాడు పూరి. 

 

పవన్ కెరియర్ లో బద్రి సెన్సేషనల్ హిట్ గా నిలిచింది. ఆ తర్వాత ఖుషి కూడా సూపర్ హిట్ సాధించింది. బద్రి తర్వాత పూరి డైరక్షన్ లో పవన్ కళ్యాణ్ కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమా చేశారు. ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు. అయితే మరోసారి పూరి, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో సినిమా రావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. బద్రి 2 చేయాలని ఫ్యాన్స్ కోరుతున్నా సరే అలాంటి కథ వస్తే మాత్రం తప్పకుండా బద్రి 2 చేస్తానని అప్పట్లో అన్నారు పూరి. బద్రి 2 వస్తే మాత్రం మరోసారి ఫ్యాన్స్ పండుగ చేసుకునే అవకాశం ఉంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: