టాలీవుడ్ హీరోయిన్లలలో ఫైర్ బ్రాండ్ల కథానాయికలు చాలా మందే ఉండేవారట. వారెవరో ఇప్పుడుకొకసారి చూద్దాం. ఫైర్ బ్రాండ్‌లో వాణిశ్రీ కూడా ఒకరు. జూనియర్ ఆర్టిస్ట్‌గా ప్రయాణం మొదలుపెట్టి హీరోయిన్గా ఎదిగిన వాణిశ్రీని చూసి టైమ్, డిసిప్లేన్కి ప్రాణమిచ్చే ఎన్టీఆర్ లాంటి వారు కూడా భయపడేవారంట. ఆమె షూటింగ్‌కి కాస్త లేటుగా వచ్చినా ఏమి అనకపోయేవారంట. అలాగే కేవలం మేకప్‌కే రెండు గంటలు సమయం తీసుకున్నా కామ్‌గా ఉండిపోయేవారట. చంద్రమోహన్, రామకృష్ణ, శ్రీధర్ లాంటి హీరోలకయితే ఆమె చెప్పిందే వేదం. ఆమెతో కలిసి చేసేదే సినిమాగా ఫీలవయ్యేవారు.
ఇక ఒక దశలో విజయశాంతి హీరోయిజం నడిచిందంటే అతిశయోక్తి కాదు. హీరోలను చూసి భయపడే ఆ రోజుల్లో తనని చూసి అందరూ హడలి చచ్చేవారట. అందరికి హీరోల రేంజ్ బిల్డ్ప్ ఇచ్చేది శాంతి. హీరోలకేమయితే రాచమర్యాదలు చేసేవారో అంతకన్నా ఎక్కువే చేయించుకునేది ఈమె. కర్తవ్యం, రాములమ్మ లాంటి లేడీ ఓరియంటెడ్ సినిమాలు హిట్ ఇచ్చిన విజయశాంతి తన బాగానే నడిపించారు.
ఇక లక్ష్మీ అందరికి తెలిసిన వ్యక్తే. లాహిరి లాహిరి వంటి చిత్రాల్లో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించి మిధునం లాంటి చిత్రాల్లో అత్యంత కీలక పాత్రల్లో నటించిన నటి. ఆమె నటనలో ఎన్ని షేడ్స్ అయితే ఉంటాయో అంతకన్నా ఎక్కువగా ఆమె బిహేవియర్లో ఉంటాయి. హీరోనా అయితే ఏమిటి మేము ఇక్కడ హీరోయిన్స్ అనే రేంజ్ మెయిన్‌టెయిన్ చేసేది. దీంతో కొన్ని కొన్ని అవకాశాలను చేజార్చుకునేది. కాని ఎంత మాత్రం తగ్గని స్వతంత్య్ర భావాలు అల హీరోయిన్ లక్ష్మిది. ఇక ఈ కోవలోకి వచ్చేవారు మరికొందరున్నారు. వాళ్ళే ఇలియానా, డిస్కోశాంతి, ముమైత్‌ఖాన్, వీళ్ళు కూడా ఇలాంటి వారేనట. ఇలియానా గురించి హీరో తరుణ్ అయితే డైరెక్ట్ గానే కామెంట్ చేశాడు. ఆమె ఎప్పుడు ఎలా ఉంటుందో ఆమెకే తెలియదట. ఇక డిస్కోశాంతి మ్యాడమ్ షాట్ రెఢీ అంటే మందు మీ హీరోని స్పెప్లు సరిగా ప్రాక్టీస్ చెయ్యమనేదంట. ముమైత్ కూడా అంతేనట మూడ్‌ని బట్టి ఉండేదట.ఏ టైమ్‌లో ఏ మూడ్‌లో ఉండి ఏమంటుందో తెలియక హడలిపోయేవారట. ఇక నయనతార, నిత్యామీనన్కూడా ఇందుకు మినహాయింపు ఏమీ కాదు. ఇలా హీరోలే కాదు హీరోయిన్లే ఎక్కువ ఫైర్ బ్రాండ్ ఇమేజ్ కలిగి ఉండేవారని చెబుతుంటారు.