టాలీవుడ్ లో బాలకృష్ణ సినిమాలకు ఒకప్పుడు మంచి క్రేజ్ ఉండేది అనేది వాస్తవం. ఆయన సినిమా విడుదల అవుతుంది అంటే చాలు ఆయన అభిమానులతో పాటుగా ఇతర ప్రేక్షకులు కూడా ఎక్కువగా ఎదురు చూస్తు ఉంటారు. టాలీవుడ్ లో ఆయన సినిమాల కోసం ప్రత్యేకంగా ఎదురు చూసే ప్రేక్షకుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు బాలకృష్ణ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత ఆయన ఏ సినిమా చేస్తారు అనేది స్పష్టత రావడం లేదు. ఈ సినిమా తర్వాత ఆయన ఒక అగ్ర దర్శకుడి తో తనకు హిట్ ఇచ్చిన దర్శకుడు తో సినిమా చేస్తారు అని అంటున్నారు. 

 

కాని బాలకృష్ణ ఇప్పుడు ఏ సినిమా చేయడానికి ఆసక్తి చూపించడం లేదని అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. ఆయన సినిమాల నుంచి తప్పుకోవడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారని తన కొడుకుని మాత్రమే సినిమాల్లోకి తీసుకుని రావాలని తాను ఇక సినిమాల నుంచి పూర్తిగా తప్పుకోవడమే మంచిది అని భావిస్తున్నారట. చిన్న చిన్న హీరోల సినిమాల్లో ఏదైనా మంచి పాత్ర వస్తేనే సినిమా చెయ్యాలని లేకపోతే సినిమా చేయవద్దు అనే ఆలోచనలో ఆయన ఉన్నారని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. మరి దీనికి కారణం ఏంటీ అనేది స్పష్టం గా తెలియదు. 

 

ఆయన ఇప్పటికే తన తో సినిమా చెయ్యాలి అనుకునే దర్శక నిర్మాతలకు ఈ విషయం చెప్పారని ఏ సినిమా తాను చేయలేను అని అని బాలకృష్ణ చెప్పారు అని అంటున్నారు. మన తెలుగులో బాలకృష్ణ కూడా ఈ మధ్య కాలంలో ఆదరణ బాగా తగ్గిపోయింది అనే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. అందుకే ఆయన సినిమాలు వద్దు అని భావిస్తున్నారని అంటున్నారు. ప్రస్తుతం బోయపాటి తో చేస్తున్న సినిమా వచ్చే ఏడాది వచ్చే అవకాశాలు ఉన్నాయని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: