టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ లో ఎన్నో సినిమాలకు కొరియోగ్రాఫీ అందించి తనదైన మార్క్ చాటుకున్నారు తరుణ్ మాస్టర్.  సినిమాల్లోనే కాదు ఢీ రియాల్టీ షోలో ఎంతో కాలం పాటు జడ్జీగా వ్యవహరించారు తరుణ్ మాస్టార్.  ఆయన శిష్యులుగా ఎంతో మంది ఇప్పుడు సినీమా ఫీల్డ్ లో కంటిన్యూ అవుతున్నారు.  తమిళనాట సూపర్ స్టార్ రజినీకాంత్ కి ఎక్కువగా కొరియోగ్రఫీ అందించారు.  అయితే రజినీకాంత్ గురించి తరుణ్ మాస్టర్ చెప్పిన విషయాలు చూస్తే నిజంగా షాక్ అవుతారు.  ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తరుణ్ మాస్టర్ మాట్లాడుతూ.. రజనీకాంత్ కి ఒక సినిమా షూటింగ్ సమయంలో రెండు మోకాళ్లు దెబ్బతిన్నాయి.

 

అందువలన ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన పాటలకు డాన్స్ ను కంపోజ్ చేసేవాడిని. ఆయన స్టైల్ ను జోడిస్తూ తేలికగా వుండే మూమెంట్స్ ను కంపోజ్ చేసేవాడిని.. ఆయనతో కంపోజ్ చేయిస్తున్నంత సేపు ఎంతో కూల్ గా ఉండేవవార.. 'ముత్తు'లో 'థిల్లానా థిల్లానా ..' డాన్స్ అలాంటిదే. అమితాబ్ తరువాత నేను చూసిన క్రమశిక్షణ కలిగిన స్టార్స్ లో రజనీ ఒకరు.  సినీ పరిశ్రమలో ఆయనకు ఎంతో గొప్ప పేరు ఉన్నా.. నిడారంబరంగా ఉండేవారు. మేకప్ వేసుకుంటే ఆ రజినీకాంత్ వేరే ఉంటాడని ఆయన్ని చూసిన తర్వాతే తెలిసిందే.

 

మేకప్ తీస్తే ఆయనంత ఆత్మీయులు ఇక ఎక్కడా దొరకరు అనిపిస్తుంది.  అంతే కాదు ఆయన కఠోర శ్రమ ఆయన్ని ఈ స్థాకియి తీసుకు వచ్చిందని అన్నారు.  ఉదయం 7 గంటలకు షూటింగు అంటే, ఆయన 11 గంటలకు వచ్చినా అడిగేవారు లేరు. కానీ ఆయన 6 గంటలకే మేకప్ వేసుకుని సెట్లో సిద్ధంగా ఉండేవారు. సెట్లో ఆయన చాలా సింపుల్ గా ఉండేవారు. ఎన్ని సార్లు అయినా కరెక్ట్ వచ్చేదాక పట్టుబడతారు. ఎన్నిసార్లు రిహార్సల్ అయినా విసుక్కోకుండా చేసేవారు. అలసిపోతే చిన్నపాటి స్టూల్ పై కూర్చుని సేద తీరేవారు.  అందుకే ఆయన గొప్ప నటులు అయ్యారని తెగ పొగిడేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: