మన తెలుగులో సమంతాకు ఉన్న క్రేజ్ ఏ హీరోయిన్ కి ఉండదు అనేది వాస్తవం. ముందు కాలేజి విద్యార్ధుల నుంచి ఆమె కు ఎక్కువగా ఫాలోయింగ్ ఉంటుంది అనే విషయం అందరికి తెలిసిందే. కాలేజి విద్యార్ధులు ఎక్కువగా ఆమెను ఫాలో అవుతూ ఉంటారు. చిన్న చిన్న హీరోల సినిమాలు అయినా సరే ధైర్యంగా చేస్తూ ఉంటుంది ఆమె. ఇక ఇప్పుడు నిర్మాత అవతారం కూడా ఎత్తింది అని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఆమె సినిమా చేయడానికి గానూ ఒక చిన్న హీరోని సెలెక్ట్ చేసుకుంది అని అంటున్నారు. ఇది ఎంత వరకు నిజం అనేది తెలియదు గాని ఆమె ఆ సినిమాలో భారీగా పెట్టుబడి పెట్టే ఆలోచనల ఉందని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. 

 

సినిమా కోసం సమంతా తన భర్తను ఒప్పించి మరీ చేస్తుంది అని అంటున్నారు. ఎంత వరకు నిజమో తెలియదు గాని ఆ హీరో టాలీవుడ్ కి కొత్త అని ఆ హీరోని తాను పరిచయ౦ చెయ్యాలని ఆమె భావిస్తున్నట్టు సమాచారం. దీనికి సంబంధించి ఒక కథ కూడా సిద్దంగా ఉందని అందుకే ఆమె ఇప్పుడు ఆ సినిమాను పూర్తి చెయ్యాలని భావిస్తుంది అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. ఈ సినిమా చేయడం ముందు ఆమె భర్త నాగ చైతన్య కు అసలు ఇష్టం లేదని అయినా సరే ఆమె ఒప్పించి ఈ సినిమా చెయ్యాలని భావించింది అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. 

 

ఇప్పుడు ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకుని వెళ్ళే ప్రయత్నంలో ఉంది ఆమె. దీనికి సంబంధించి కొన్ని చర్చలు జరుగుతున్నాయని అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ సినిమాను కరోనా ప్రభావం అయిన వెంటనే సెట్స్ మీదకు తీసుకుని వెళ్ళే అవకాశం ఉందని టాలీవుడ్ లో టాక్ వినపడుతుంది.  మరి సమంతా ఎం చేస్తుంది అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: