కరోనాతో ప్రపంచమంతా వణికిపోతోంది. లాక్ డౌన్ లు, హోమ్ క్వారంటైన్ లు అంటూ జనాలంతా ఒక టెన్షన్ వాతావరణంలో ఉన్నారు. అయితే సన్నీలియోన్ మాత్రం నాదో ప్రపంచం అన్నట్టు హంగామా చేస్తోంది. ఫోటో షూట్ లు, వీడియోలతో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది సన్నీ. 

 

సన్నీలియోన్ ఎప్పుడూ జనాల ఎక్స్ పెక్టేషన్స్ లో ఉండదు.  ఎవ్వరూ ఊహించని రేంజ్ లో గ్లామర్ బాంబులు విసురుతుంటుంది. ప్రపంచమంతా లాక్ డౌన్.. లాక్ డౌన్ అంటూ అన్నింటికీ తాళాలు వేస్తోంటే.. సన్నీ మాత్రం ఈ సిట్యుయేషన్ ని కూడా చాలా లైట్ గా తీసుకుంటోంది. ఫోటో షూట్స్, వీడియోస్ తో ఇన్ స్టాగ్రామ్ లో హంగామా చేస్తోన్న సన్నీ. 

 

బోజ్ పురి నుంచి మొదలుపెడితే బాలీవుడ్ వరకు అందరూ స్టే హోమ్, స్టే సేఫ్ అని పోస్ట్ లు పెడుతున్నారు. అయితే సన్నీ మాత్రం ప్రపంచం మొత్తం స్థంభించకపోయినా సరే.. మీ ఇష్టాలను మాత్రం విడిచిపెట్టకండనే మెసేజ్ లు ఇస్తోంది. వర్కవుట్ వీడియోలు, ఫోటో షూట్ ల అనుభవాలు అన్నింటినీ షేర్ చేస్తోంది సన్నీ. ఇక రీసెంట్ గా ఎయిటీస్ స్టైల్ అవుట్ ఫిట్, హెయిర్ స్టయిల్ తో ఎయిరో బిక్స్ చేసిన వీడియో పోస్ట్ చేసింది సన్నీ. 

 

సన్నీలియోన్ అప్ లోడ్ చేస్తోన్న హాట్ ఫోటోలు, వీడియోలతో నెటిజన్లకు గ్లామర్ షాక్ కొడుతోంది. ఈ షాక్ ట్రీట్ మెంట్ తో చాలామంది కుర్రాళ్ల ఆలోచనలు కూడా మారిపోతున్నాయి. లాక్ డౌన్ కంటిన్యూ అయితే ఏంటి.. అడ్డా మీటింగ్స్ కు బ్రేకులు పడితే ఏంటి.. ఎక్కడున్నా లైఫ్ ను ఎంజాయ్ చేయాలి. ప్రతీ మూమెంట్ ను ఎక్స్ పీరియన్స్  చేయాలనే ఇదిలో వెళ్లిపోతున్నారు. థాంక్స్ టు సన్నీ అని కామెంట్స్ పెడుతున్నారు. మొత్తానికి లాక్ డౌన్ సమయంలో సన్నీలియోన్ పిచ్చెక్కిస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: