టాలీవుడ్ లో మినిమం గ్యారెంటీ హీరో నాచురల్ స్టార్ నాని అన్న సంగతి తెలిసిందే. అంతేకాదు ఫ్లాప్స్ తో సంబధం లేకుండా నాని తో సినిమాలు నిర్మించడానికి నిర్మాతలు ఎప్పుడు సిద్దంగా ఉంటారు. 'జెర్సీ' యావరేజ్ సినిమా తర్వాత నాని హీరోగా మళ్ళీ అదే నిర్మాణ సంస్థలో మరో సినిమాని నిర్మించటానికి మేకర్స్ రెడీ అయ్యారు. 'టాక్సీ వాలా' లాంటి వినూత్నమైన కథని తెరకెక్కించి సూపర్ హిట్ అందుకున్న దర్శకుడు 'రాహుల్ సాంకృత్యన్' దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కించబోతున్నారు. ఇక ఈ సినిమాకి ఇంతక ముందే నాని బర్త్ డే సందర్భంగా 'శ్యామ్ సింగ రాయ్' అన్న టైటిల్ ని కన్‌ఫర్ చేస్తూ పోస్టర్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.

 

ఇక ఈ సినిమాని 2020 డిసెంబర్ 25న రిలీజ్ చేయాలని కూడా మేకర్స్ ప్లాన్ చేసుకున్నారు. నాని కెరీర్ లో 27వ సినిమాగా నిర్మించనున్న ఈ సినిమాలో మరోసారి నానికి జంటగా సాయి పల్లవి నటిస్తుందని అన్నారు. గతంలో ఈ ఇద్దరు కలిసి ఎం.సి.ఏ సినిమాలో నటించిన సంగతి తెలిసందే. ఇక ఈ సినిమా పిరియడిక్ కాన్సెప్ట్ తో రూపొందనుందని వార్తలు వచ్చాయి. అంతేకాదు ఈ సినిమాని నిర్మాతలు కూడా హై బడ్జెట్ తో పాన్ ఇండియా సినిమాగా నిర్మించాలని అనుకున్నారట. దాంతో నాని కెరీర్ లో 'శ్యామ్ సింగ రాయ్' ఫస్ట్ పాన్ ఇండియా సినిమా అని అందరూ భావించారు.

 

కానీ కరోనా లాక్ డౌన్ కారణంగా ప్రస్తుతం నిర్మాతలు ఈ ప్రాజెక్ట్ ని వద్దనుకుంటునట్టు లేటెస్ట్ న్యూస్. అంతేకాదు లాక్ డౌన్ తరువాత కూడా సినిమాను నిర్మించాలనుకోవడం లేదని తాజాగా అందిన సమాచారం. ఇక కరోనా కారణంగా సినిమా ఇండస్ట్రీమీద ఈ ప్రభావం దాదాపు సంవత్సరం పైనే ఉండబోతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దాంతో నిర్మాతలు నాని తో పాన్ ఇండియా సినిమాని నిర్మించి రిస్క్ చేయడం ఎందుకు అన్న నిర్ణయానికి వచ్చారట. దాంతో ఇన్నాళ్ళు అందరు క్రేజీ సినిమాగా భావించిన 'శ్యామ్ సింగ రాయ్' క్యాన్సిల్ అని చెప్పుకుంటున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: