కొన్ని సినిమాలు హిట్టైతే.. మరికొన్ని సినిమాలు క్లాసిక్స్ గా మిగిలిపోతాయి. అతి కొద్ది సినిమాలు మాత్రమే గేమ్ చేంజర్స్ అవుతాయి. ఆ సినిమాల ప్రభావం తర్వాత వచ్చే అన్ని సినిమాలపై ఉంటుంది. అటువంటి కోవలోకి వచ్చే సినిమానే ‘పోకిరి’. ఈ సినిమాతో మహేశ్ కు సూపర్ స్టార్ స్టేటస్ వచ్చేసింది. సినిమాను తెరకెక్కించిన పూరి జగన్నాధ్ కు స్టార్ డైరక్టర్ నుంచి నెంబర్ వన్ డైరక్టర్ హోదా వచ్చేసింది. పోకిరి వచ్చి 14 ఏళ్లయినా ఈ సినిమా గురించి ఇంకా చెప్పుకునే అంశాలు కొత్తగానే ఉంటాయి.

IHG' - Binge-Watch <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=MAHESH' target='_blank' title='mahesh- గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>mahesh</a> Babu's Super-Hit Films On His 43rd ...

 

పూరి జగన్నాధ్ ఈ సినిమాను తెరకెక్కించిన విధానం సినిమా విజయంలో కీలకపాత్ర పోషించింది. మాస్ క్యారక్టరైజేషన్ ను ఇంత స్టైలిష్ గా చూపించిన సినిమా అప్పటివరకూ రాలేదు. ఇదంగా పూరి జగన్నాధ్ టేకింగ్ మహిమే అని చెప్పాలి. సినిమాలో గన్ కల్చర్ ను పూరి తెరకెక్కించిన విధానం హాలీవుడ్ రేంజ్ ను తలపిస్తుంది. సినిమాలోని ప్రతి యాక్షన్ సీక్వెన్స్ కూడా గన్ షూటింగ్ తోనే ఉంటుంది. మహేశ్ హీరోయిజాన్ని పూరి చూపించిన తీరు అద్భుతం. గన్, గ్యాంగ్, డాన్ కల్చర్.. ఇలా ప్రతి అంశంలోనూ పూరి మార్క్ కనిపిస్తుంది.

IHG

 

పోకిరిలో హీరో, విలన్ మధ్య వచ్చే యాక్షన్ సీన్లకు రెగ్యులర్ సినిమాలకు పోలిక ఉండదు. రెండు, మూడు గ్యాంగ్ లు, రియలిస్టిక్ డైలాగ్స్ తో ప్రేక్షకులు థ్రిల్ ఫీలయ్యేలా చేశాడు పూరి. క్లైమాక్స్ కూడా బిన్నీ మిల్స్ తీసిన యాక్షన్ సీన్లు భారీగా ఉంటాయి. క్లైమాక్స్ లో పోలిస్ గా మహేశ్ క్యారెక్టర్ రివీల్ అయ్యే సీన్ మొత్తం సినిమా రిజల్ట్ నే మార్చేసింది. అక్కడ పూరి మెయింటైన్ చేసిన టెంపో, మహేశ్ ఎంట్రీ సీన్ పోకిరికి తెలుగు సినిమా చరిత్రలో ఓ ప్రత్యేకమైన ప్లేస్ ను క్రియేట్ చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: