భాగమతి తరువాత చాలా గ్యాప్ తీసుకొని స్టార్  హీరోయిన్ అనుష్క ప్రధాన పాత్రలో నటించిన చిత్రం నిశ్శబ్దం. నిజానికి ఈ సినిమా జనవరి చివర్లో విడుదలకావాల్సి వుంది అయితే అప్పటికి గ్రాఫిక్స్ వర్క్ పూర్తి కాకపోవడంతో వాయిదాపడింది. ఇక అన్ని పనులు పూర్తి చేసుకుని ఏప్రిల్ 2న విడుదలచేద్దాం అనుకున్నారు కానీ కరోనా షాక్ ఇచ్చింది. దాని దెబ్బకు మరోసారి వాయిదా పడింది.
 
అయితే ఇంతలో ఈ సినిమా డైరెక్ట్ గా ఓటిటి లో విడుదలకానుందంటూ వార్తలు వచ్చాయి. వెంటనే అలెర్ట్ అయిన చిత్ర బృందం నిశ్శబ్దం మొదట థియేటర్లలోనే విడుదలకానుంది ఎలాంటి రూమర్స్ ను నమ్మకండని క్లారిటీ ఇచ్చారు. థియేటర్ల ఓపెన్ కు ప్రభుత్వం నుండి పర్మిషన్ వచ్చాక ఈ చిత్రాన్నీ విడుదలచేయనున్నారు. ఇక ఈ చిత్రం యొక్క డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ దక్కించుకుంది. ఇందుకోసం భారీ మొత్తాన్ని చెల్లించిందని టాక్.
 
సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో హేమంత్ మధుకర్ తెరకెక్కించిన ఈ చిత్రంలో మాధవన్  ,సుబ్బరాజు, అంజలి ,షాలిని పాండే తో పాటు హాలీవుడ్ నటుడు మైఖేల్ మాడిసన్ ముఖ్య పాత్రల్లో నటించగా  గోపి సుందర్ సంగీతం అందించాడు. కోన ఫిలిం కార్పొరేషన్ ,పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ల పై కోన వెంకట్, టిజి విశ్వ ప్రసాద్  ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించారు. ఈచిత్రం తెలుగు తోపాటు తమిళ ,హిందీ భాషల్లో కూడా విడుదలకానుంది. ఇక నిశ్శబ్దం తరువాత అనుష్క ఇంతవరకు మరో సినిమాకు సైన్ చేయలేదు. అయితే  అనుష్క కు పెద్దగా ఆఫర్లు కూడా రావడంలేదని సమాచారం. మరి ఈ సినిమా తోనైనా మళ్ళీ బిజీ అవుతుందేమో చూడాలి.   
 

మరింత సమాచారం తెలుసుకోండి: