దర్శక దిగ్గజం ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా అనుష్క శెట్టి హీరోయిన్ గా ఆర్కా మీడియా బేనర్ పై అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన సినిమా బాహుబలి 2 ది కంక్లూజన్. 2017 లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అత్యద్భుత విజయాన్ని అందుకోవడంతో పాటు అప్పట్లో రెండు వేల కోట్ల రూపాయల వరకు కలెక్షన్ అందుకుంది. అంతకుముందు 2015లో బాహుబలికి కొనసాగింపుగా వచ్చిన ఈ సినిమా పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉండటం, అలానే వాటిని మించేలా దర్శకుడు రాజమౌళి ఈ సినిమాని తెరకెక్కించడం జరిగింది. 

IHG

రెబల్ స్టార్ ప్రభాస్, మహేంద్ర బాహుబలి, అమరేంద్ర బాహుబలి వంటి రెండు పాత్రల్లో అత్యద్భుత నటన, దేవసేనగా అనుష్క వండర్ఫుల్ పెర్ఫార్మెన్స్, విలన్ భల్లాలదేవుడు గా రానా అదిరిపోయే నటన, రాజమౌళి భారీ టేకింగ్, ఆకట్టుకునే కథ కథనాలు, భారీ స్థాయిలో విజువల్ ఎఫెక్ట్స్, యాక్షన్ సీన్స్, హృదయానికి హత్తుకునే ఎమోషనల్ సన్నివేశాలు, పవర్ ఫుల్ డైలాగ్స్ వెరసి బాహుబలి 2 కి అత్యంత భారీ విజయాన్ని అందించాయి. కేవలం తెలుగులోనే కాక హిందీ సహా పలు ఇతర భాషల్లో కూడా రిలీజ్ అయిన ఈ సినిమా నెలకొల్పిన రికార్డులు ఇప్పటికీ అలానే చెక్కుచెదరకుండా పదిలంగా ఉండడంతో పాటు ఎవరూ కూడా వాటిని టచ్ చేయలేనంత ఎత్తులో ఉన్నాయి. 

IHG

ముఖ్యంగా ఒక రీజనల్ సినిమాకు దాదాపుగా రెండు వేల కోట్ల రూపాయల కలెక్షన్ వచ్చింది అంటే అది సామాన్యమైన విషయం కాదని, ఈ విధంగా తన అత్యద్భుత దర్శకత్వ ప్రతిభతో దర్శక ధీరుడు రాజమౌళిబాహుబలి 2 సినిమా తెరకెక్కించారని, అలానే ఒక రకంగా చెప్పాలంటే ఈ సినిమా నెలకొల్పిన రికార్డులు బద్దలు కొట్టాలంటే ప్రస్తుతం ఆయన తీసే ఆర్ఆర్ఆర్ సినిమాకు మాత్రమే అది సాధ్యం అని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక ఈ సినిమా నేటితో సక్సెస్ఫుల్ గా బాహుబలి 2 మూడేళ్లు పూర్తి చేసుకోవడంతో పలువురు ప్రభాస్ అభిమానులు, ప్రేక్షకులు సినిమా యూనిట్ కి అభినందనలు తెలియజేస్తూ సోషల్ మీడియా మాధ్యమాల్లో దీనిని ట్రెండ్ గా సెట్ చేసి పరిగెత్తిస్తున్నారు.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: