అవును.. కాలం ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు.. ఎప్పుడు ఎలా మారుతుందో తెలియదు.. ఇంకా అలాంటి ఈ కాలంలోనే కరోనా వైరస్ వచ్చింది.. అన్ని మూపించేసింది.. అందరిని ఇంట్లోనే నిర్బంధించేసింది.. బయటకు వస్తే ప్రాణం తీస్తా అంటుంది. అలాంటి ఈ సమయంలో టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఓ సెన్సషనల్ టాక్ నడుస్తుంది. 

 

అది ఏంటి అంటే? ఓటీటీ.. అంటే అదేనండీ.. ఆన్లైన్ స్ట్రీమింగ్ మీడియా. ఇన్నాళ్లు అంటే కేవలం యూట్యూబ్ మాత్రమే ఉండే.. ఇప్పుడు హాట్ స్టార్, అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్, సన్ నెక్స్ట్, ఆహా అని ఎన్నో రకాల ఆన్లైన్ స్ట్రీమింగ్ వచ్చేశాయ్.. దీంతో అందరూ కూడా ఫోన్ లోనే ఎన్నో సినిమాలు చూస్తున్నారు.. 

 

హాలీవుడ్ కావచ్చు, బాలీవుడ్ కావచ్చు మరేదైనా కూడా కావచ్చు.. అన్ని ఆన్లైన్ లో చూసేస్తాం. ఇంకా ఇప్పుడు ఇందులో వచ్చే సినిమాలకు కూడా మంచి డిమాండ్ ఉంది.. దీంతో ఏదైనా ఒక సినిమా రిలీజ్ అవుతుంది అంటే ఇవి అన్ని కూడా మాకు అంటే మాకు అని కొట్టుకుంటుంటాయి.. 

 

దీంతో సినిమాలు అన్ని కూడా థియేట‌ర్ల వరుకు వెళ్లకుండానే ఈ ఓటీటీలోనే చూసేలా అవుతున్నాయి.. నిజానికి కరోనా వైరస్ దెబ్బ సినిమా ఇండస్ట్రీపై ఎంత పడింది అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఇంకా థియేటర్స్ కూడా ఎప్పుడు తెరుస్తారో తేలింది... ప్రస్తుత పరిస్థితిని చూస్తే ఇంకా ఒక 5 లేదా 6 నెలలు అయినా పట్టేలా ఉంది.. 

 

దీంతో సురేష్ బాబు ఓ సలహా ఇచ్చాడు.. ఆ సలహా ఏంటి అంటే? థియేటర్స్ తెరవడానికి సమయం పడుతుంది.. అందుకే చిన్న సినిమాలు అన్ని కూడా ఓటీటీలో విడుదల చేస్తే కనీసం బడ్జెట్ అయినా వెనక్కి వస్తుంది.. ఇంకా ఇప్పుడు సినిమా తీసే పద్ధతి కూడా మార్చాలి.. షూటింగ్ లో 100 మంది కాకుండా 10 లేదా 20 మందితో షూటింగ్ చెయ్యడానికి అవకాశం ఇస్తే బాగుండు అని అయన కోరుకున్నారు.. 

 

అయితే ఓటీటీలో తమ సినిమాలను విడుదల చెయ్యడానికి కొందరు హీరోలు ఒప్పుకోకుంటే.. మరికొందరు దర్శకులు ఒప్పోకోవడం లేదు.. దీని వల్ల పూర్తిగా నష్టపోయేది నిర్మాతలే.. ఎందుకంటే వారు పెట్టిన పెట్టుబడిలో కాస్త అయినా రాకుంటే మరో సినిమాకు నిర్మాతగా వ్యవహరించలేరు... ఇంకా ఓటీటీలో కూడా మాములు లాభాలు లేవు అంటే నమ్మండి. 

మరింత సమాచారం తెలుసుకోండి: