సౌత్ సినీ పరిశ్రమలో సమంత క్రేజ్ గురించి అందరికి తెలిసిందే. ఏమాయ చేసావే సినిమా నుండి జాను వరకు తనకు ఇచ్చిన పాత్రకు నూటికి నూరు పాళ్ళు న్యాయం చేయడమే సమంత స్పెషల్. పాత్ర ప్రాధాన్యతని బట్టి సమంత తన పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుంటుంది. కెరియర్ లో 44 సినిమాల దాకా చేసిన సమంత తెలుగు, తమిళ భాషల్లో సూపర్ స్టార్స్ అందరితో నటించి మెప్పించింది. తన సహజ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న సమంత పదేళ్ల కెరియర్ లో ఎన్నో అవార్డులు రివార్డులు అందుకుంది. వీటన్నిటి కన్నా తెలుగు ప్రేక్షకుల్లో చెరిగిపోనిస్థానం సంపాదించుకుంది సమంత. 

 

పాత్ర కోసం ఎలాంటి రిస్క్ అయినా తీసుకునే సమంత ఆమె నటించిన కొన్ని సినిమాల్లో అభినయం చూస్తే షాక్ అవడం గ్యారెంటీ అని చెప్పొచ్చు. పాత్ర ప్రాధాన్యత ఉంటే చాలు అది హీరోయిన్ గానే అవ్వాల్సిన పని లేదు అన్న ఫార్ములా ఫాలో అవుతున్న సమంత అలా కూడా సూపర్ హిట్లు తన ఖాతాలో వేసుకుంటూ వచ్చింది. మహానటి సావిత్రి బయోపిక్ గా వచ్చిన మహానటి సినిమాలో సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ స్క్రీన్ మొత్తం ఆక్యుపై చేసినా సమంత తనకు ఇచ్చిన పాత్రలో అదరగొట్టింది. 

 

ఓ పక్క కీర్తి సురేష్ సావిత్రిగా తన పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకోగా.. ఆమెకు ఏమాత్రం తక్కువ కాకుండా సమంత తన పాత్రలో మెప్పించింది. ముఖ్యంగా ఆ సినిమాలో సావిత్రి మరణించిన తర్వాత విండో దగ్గర సమంత చూపించిన అభినయం ఎప్పటికి ప్రేక్షకులకు గుర్తుండిపోతుంది. నటిగా మొదలైన తన ప్రస్థానంలో నేటితరం మహానటిగా కీర్తి కిరీటాన్ని అందుకుంది  సమంత. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న సమంత ఆమె ఇంకొన్నాళ్ళు తన నటనతో ప్రేక్షకులను మెప్పించాలని కోరుకుందాం.               

మరింత సమాచారం తెలుసుకోండి: