పవన్ కళ్యాణ్ కు ఉన్నది అభిమానులు కాదు భక్తులు మాత్రమే అంటారు. ఆమాటలను నిజం చేస్తూ యాంకర్ రవి ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ ఇప్పుడు పవన్ అభిమానులకు విపరీతమైన జోష్ ను ఇస్తోంది. ‘సమ్‌థింగ్ స్పెషల్’ ‘పటాస్’ ‘ఢీ’ లాంటి ప్రోగ్రామ్స్ చేసి బుల్లితెర పై తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని ఏర్పరుచుకున్న ఈయాంకర్ ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా ఖాళీగా ఉంటూ ఒకమీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చాడు.


ఈ ఇంటర్వ్యూలో టాప్ హీరోల పై కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసాడు. తానెప్పుడూ కష్టాన్నే నమ్ముకుంటానని నటుడు గా ఎదగాలనే ఉద్దేశ్యంతోనే తాను యాంకరింగ్ లోకి వచ్చిన విషయాన్ని వివరిస్తూ తన గురువు మెగా స్టార్ చిరంజీవి అంటూ షాకింగ్ కామెంట్స్ చేసాడు. ఆ తర్వాత బాలకృష్ణ గురించి మాట్లాడుతూ బాలకృష్ణ నాగార్జున వెంకటేష్ ఈ వయస్సులో కూడా ప్రేక్షకులను ఎంటర్‌ టైన్ చేస్తున్నారని అలాంటి స్థాయి అందరికీ రాదు అంటూ తన అభిప్రాయం తెలియచేసాడు.


ఇక ఇదే ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ పక్కన తమ్ముడిగా ఛాన్స్ వస్తే మీ ఫీలింగ్స్ ఏమిటని అని అడిగినప్పుడు పవన్ పక్కన తమ్ముడు పాత్ర అవసరం లేదు ఆయన పక్కన ‘పనోడిలా’ నటించే అవకాశం వచ్చినా తన జీవితం ధన్యం అంటూ యాంకర్ రవి చేసిన కామెంట్స్ ఇప్పుడు పవన్ అభిమానుల మధ్య వైరల్ గా మారాయి. ఇది ఇలా ఉండగా లాక్ డౌన్ సమయంలో ఎవరు ఊహించని విధంగా పవన్ జనసేన పార్టీకి సోషల్ మీడియా ట్విటర్ ఎకౌంట్ కు ఏకంగా 1 మిలియన్ ఫాలోయర్స్ గత మూడు నెలలుగా ఏర్పడటం షాక్ ఇచ్చే న్యూస్ గా మారింది.

 

గతఎన్నికలలో కేవలం 17 లక్షల ఓట్లు మాత్రమే తెచ్చుకుని కనీసం పవన్ కళ్యాణ్ ను కూడ గెలిపించుకో లేకపోయిన జనసేన క్యాడర్ ఈ లాక్ డౌన్ సమయంలో చాల చైతన్య వంతంగా పని చేస్తూ అనేక చోట్ల సేవా కార్యక్రమాలు చేస్తూ అందరి మన్నలను పొందుతోంది. పవన్ వ్యక్తిగత ట్విటర్ ఎకౌంట్ కు 3.9 మిలియన్ ఫాలోయర్స్ ఉండటమే కాకుండా ఇప్పుడు జనసేన సోషల్ మీడియా ఎకౌంట్ కు ఇప్పటి లాక్ డౌన్ సమయంలో చాలవేగంగా ఫాలోయర్స్ పెరుగుతూ ఉండటం పరిశీలిస్తున్న విశ్లేషకులు పవన్ పొలిటికల్ గ్రాఫ్ ఈ కరోనా లాక్ డౌన్ సమయంలో పెరగడం వెనుక కారణం ఏమిటి అంటూ విశ్లేషణలు చేస్తున్న పరిస్థితులలో యాంకర్ రవి చేసిన లేటెస్ట్ కామెంట్స్ పవన్ అభిమానులకు మంచి జోష్ ను కలిగిస్తున్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి: