కరోనా ప్రభావం అన్ని రంగాల పై ఉన్నప్పటికీ సినిమా రంగం పై లాక్ డౌన్ ప్రభావం ఊహకు కూడ అందనంత నెగిటివ్ స్థాయిలో ఉంది. వచ్చేనెల కూడ లాక్ డౌన్ కొనసాగే పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్న పరిస్థితులలో కనీసం మరొక రెండు నెలల వరకు ధియేటర్లు తెరుచుకునే పరిస్థితి లేదు అని అంటున్నారు. 


మరికొందరు సీనియర్ ప్రొడ్యూసర్స్ అయితే ధియేటర్లు మరో నాలుగు నెలల వరకు తెరుచుకునే పరిస్థితి లేదు అనీ ప్రేక్షకులకు పూర్తిగా కరోనా భయం తగ్గిపోకుండా ధియేటర్స్ తెరిచినా జనంరారు అన్న అభిప్రాయంలో ఉన్నారు. సినిమా థియేటర్లు మూతపడడం షూటింగులు ఆగిపోవడం కొత్త సినిమాల విడుదల విషయంలో సందిగ్ధత నెలకొనడంతో ఈమధ్యన సుమారు పదిమంది టాప్ నిర్మాతలు తమ ఇంటి నుండే ఇతర నిర్మాతలతో వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా సుమారు మూడు గంటల పాటు చాలలోతుగా మాట్లాడుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.


ఈవీడియో కాన్ఫెరెన్స్ లో అల్లు అరవింద్ దిల్ రాజ్ దానయ్య సురేశ్ బాబులతో పాటు మరికొంతమంది ప్రముఖ నిర్మాతలు పాల్గొని తమ పరిస్థితుల పై చాలలోతుగా విశ్లేషణలు చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత సంక్షోభ సమయంలో నిర్మాతలను ఆదుకునేందుకు నటీనటులు డైరెక్టర్లు అందరూ తమ పారితోషికాలు తగ్గించుకోవాలని గతంలో మాదిరిగా బయ్యర్లు డిస్ట్రిబ్యూటర్లు భారీగా అడ్వాన్సులు ఇచ్చే పరిస్థితి లేదని అదేవిధంగా గతంలో మాదిరిగా పోటీలుపడి రికార్డు రేట్లకు థియేట్రికల్ రైట్స్ కొనుక్కునే పరిస్థితులు లేవని అందుకే ఒక ప్యానల్ ను ఏర్పాటు చేసి టాలీవుడ్ లో ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి అన్నది చాల జాగ్రత్తగా ఆలోచించుకాకపోతే నిర్మాతలు మిగలరు అంటూ చాలామంది అభిప్రాయ పడునట్లు వార్తలు వస్తున్నాయి. 


మరికొంతమంది నిర్మాతలు అయితే హీరో హీరోయిన్లకు ప్రధాన టెక్నీషియన్లకు పారితోషికం బదులుగా లాభాల్లో వాటా ఇచ్చేలా అగ్రిమెంట్ కుదుర్చుకోవాలని ఈవిషయాలలో అందరు కలిసికట్టుగా వ్యవహరించాలి అని ఆలోచన చేసినట్లు తెలుస్తోంది. లాక్ డౌన్ విరమణ తర్వాత ఫిలిం ఛాంబర్ లోమరొకసారి కూర్చుని మళ్లీ చర్చించి విధి విధానాలను ఖరారు చేయాలని ఈ విధి వినాలకు అంగీకరించని హీరో హీరోయిన్స్ ను దర్శకులను పక్కకు పెట్టాలనే ఆలోచనలు కూడ చేసినట్లు వార్తలు వస్తున్నాయి ఈ వార్తలలో ఎన్ని నిజాలో తెలియకపోయినా భవిష్యత్ లో మాత్రం హీరో హీరోయిన్స్ దర్శకుల పారితోషికంలో చాల కోత పడటం ఖాయం అని అంటున్నారు.  ఇప్పుడు ఈ వార్తలు టాప్ హీరోల వరకు చేరడంతో వారంతా కూడ ప్రస్తుతం అంతర్మధనంలో ఉన్నట్లు టాక్.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: