టాలీవుడ్ లో స్టార్ హీరోల పక్కన సినిమాలు చేయడం అనేది సాధారణ విషయం కాదు. స్టార్ హీరో పక్కన సినిమాలు చెయ్యాలి అంటే కచ్చితంగా ఒక గుర్తింపు ఉండాలి అనే మాట అక్షరాలా నిజం. ఏ హీరోయిన్ అయినా సరే స్టార్ తో సినిమా చేయడానికి ఎక్కువగా ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. కాని సమంతా కెరీర్ లో మాత్రం అగ్ర హీరోలు ఆమెతో సినిమా చేయడానికి ఆసక్తి చూపించారు. ఆమె తో సినిమాలు చేస్తామని వాళ్ళే స్వయంగా అడగడం గమనార్హం. పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్, మహేష్ బాబు లాంటి హీరోలు ఆమెను సినిమాలు చెయ్యాలని కోరడం గమనార్హం. 

 

ఆమె తో సినిమా చెయ్యాలని పవన్ కళ్యాణ్ తన మనసులో మాటను ఒక సందర్భంలో బయటపెట్టారని అందుకే అత్తారింటికి దారేది సినిమాలో ఆమెను తీసుకున్నారని అంటారు. ఇక మహేష్ బాబు సినిమా దూకుడు లో కూడా ఆమెను తీసుకోవాలని భావించింది మహేష్ బాబు అని అంటున్నారు. ఆయనకు ఆమె సినిమా చెయ్యాలని ఉందని అందుకే దర్శకుడు శ్రీను వైట్ల కు అదే విషయం చెప్పగా సినిమాలో తీసుకున్నారు అనేది టాలీవుడ్ జనాల మాట. ఇక చిన్న చిన్న హీరోలు కూడా ఆమె తో సినిమా చేయడానికి ఆసక్తి చూపించారు. 

 

సమంతా తో సినిమా చేసిన ప్రతీ హీరో కూడా కెరీర్ లో పెద్ద పెద్ద హిట్స్ కొట్టి సినిమాలు చేసిన వాళ్ళే. ప్రస్తుతం సమంతా సైలెంట్ గా ఉన్నా ఆమె తో సినిమా చేస్తే బాగుంటుంది అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఇక ఎన్టీఆర్ అయితే ఆమెతో సినిమా చెయ్యాలని ఉంది పలు మార్లు చెప్పాడు. ఇలా అగ్ర హీరోయిన్ లకు ఆమె లక్కీ హీరోయిన్ గా మారిపోయింది అని అంటారు ప్రేక్షకులు. అందుకే ఆమెకు అభిమానులు ఉన్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: